Wednesday, May 8, 2024
- Advertisement -

జగన్ శ్రీశైలం పర్యటన వాయిదా.. ఏం జరిగింది ?

- Advertisement -

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాతావరణం బాగా లేనప్పుడు నల్లమల మీదుగా ప్రయాణించి హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించారు. దీంతో ఇప్పుడు వైఎస్ జగన్ శ్రీశైలం పర్యటన వాయిదా పడింది. వాతావరణం పరిస్థితులు బాగలేకపోవడం.. హెలిక్యాఫ్టర్ నల్లమల్ల మీదుగా వెళ్లడం.. అక్కడ క్యుమలోనింబస్ మేఘాలు ఉన్నాయన్న వాతవరణ శాఖ అధికారుల సమాచారంతో అధికారులు ముఖ్యమంత్రి జగన్ శ్రీశైలం పర్యటనను వాయిదా వేశారు.

సీఎం వైఎస్ జగన్ శుక్రవారం శ్రీశైలాన్ని సందర్శించాలని మొదట షెడ్యూల్ రూపొంచుకున్నారు. ఈ పర్యటనలో జగన్ వెంట జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొంటారని మీడియాకు సమాచారం ఇచ్చారు. కానీ వాతవరణ పరిస్థితి బాగలేకపోవడంతో వాయిదా పడింది. శ్రీశైలం ప్రాజెక్టు సందర్శన అనంతరం వైఎస్ జగన్ అక్కడే జలవనరుల శాఖ అధికారులతో కీలక సమావేశానికి సిద్ధమయ్యారు. పోతిరెడ్డిపాటు విస్తరణలో భాగంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభ పనులను జగన్ సమీక్షించడానికి రెడీ అయ్యారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. సుభాష్ ప్రాజెక్ట్స్ మ్యాను ఫాక్చరర్స్ లిమిటెడ్ ఈ పనులను దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనికి వర్క్ ఆర్డర్ ను కూడా జలవనరుల శాఖ అధికారులు జారీ చేశారు. ఇక తెలంగాణ సర్కార్ అభ్యంతరాలపై జగన్ ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు. కానీ ఇప్పుడు జగన్ పర్యటన వాయిదా పడటంతో ఈ కార్యక్రమాలన్ని వాయిదా పడ్డాయి.

జగన్ సర్కార్ కి హైకోర్టు లో షాక్ మీద షాక్..!

ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం జగన్..!

ఫోన్ ట్యాపింగ్ విషయంలో బాబుకు అదిరిపోయే షాక్ ఇచ్చిన జగన్..!

వైసీపీలో గంటాను తీసుకోకపోవడానికి కారణం ఇదే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -