Saturday, April 20, 2024
- Advertisement -

బీజేపీ వ్యూహాత్మక విజయం సాధించిందా..?

- Advertisement -

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లపై కారు-కమలం పార్టీల మధ్య తీవ్ర రచ్చకు దారితీసింది. దుబ్బాక ఎన్నిక వరకు సైలెంట్‌గా ఉన్న కాషాయ సేనా ఆ తరువాత కయ్యానికి కాలు దువ్వుతోంది. మరోవైపు ధాన్యం విషయంలో బీజేపీని బుక్‌ చేయాలని టీఆర్‌ఎస్ భావించింది. ఐతే కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇంతకు పై చేయి సాధించింది ఎవ్వరు…

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ గులాభీ పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేసి తిప్పి కొట్టామని బీజేపీ భావిస్తోంది. తాము ఆచి తూచి వ్యవహరించామని, ధాన్యం కళ్లాల వద్ద రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పర్యటించినప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రవర్తించిన తీరు ఆ పార్టీకే మైనెస్‌గా మారాయని చెబుతోంది. టీఆర్‌ఎస్ శ్రేణులు సంజయ్‌ని అడ్డుకొని తనపై రాళ్లు రువ్వడంతో వివాదం మరింత రాజుకుంది. దీంతో ప్రజల మద్దతు బీజేపీకి మరింత పెరినట్లు ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. రైతుల వద్ద బీజేపీని టార్గెట్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌ నేరుగా రంగంలోకి దిగడంతో.. బీజేపీ అగ్ర నేతలు సైతం టీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేశారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న 40 లక్షల మెట్రిక్‌ టన్నుల రైస్‌ను కొనేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి గతంలోనే తెలిపారు. యాసంగి పంట కూడా తాము కొనుగోలు చేస్తామని కిషన్‌ రెడ్డి చెప్పారు. బియ్యానికి రైతులకు సంబంధం లేదని కిషన్‌ రెడ్డి ప్రకటించడం ధ్వారా ధాన్యంపై టీఆర్‌ఎస్ చేస్తున్న రాజకియాన్ని ప్రజల వద్దకు తీసుకు వెళ్లగలిగామనని కమళనాధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్లపై చెర్చించాలని పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు పట్టుబట్టారు. రైస్‌ కొనుగోళు అంశంపై క్లారిటీ ఇవ్వాలని సభలో పదేపదే ఆందోళన చేస్తూ తమ పార్టీ రైతుల పక్షనే ఉందని చెప్పుకునే ప్రయత్నం చేసింది గులాభీ పార్టీ. పార్లమెంట్‌లో సైతం టీఆర్‌ఎస్‌కు బీజేపీ ధీటుగా బదులిచ్చింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తాము కొనవల్సిన 40 లక్షల మొట్రిక్‌ టన్నుల ధాన్యం కంటె అధికంగానే కొన్నామని మంత్రి పియూష్‌ గోయల్‌ ద్వారా తెలంగాణ బీజేపీ ఎంపీలు లిఖిత పూర్వకంగా చెప్పించడంతో.. ఈ ఇష్యూలో తామే పై చేయి సాధించామమే ధీమాతో ఉన్నారు తెలంగాణ బీజేపీ ఎంపీలు. రభీ సీజన్‌లో ఉన్న పంటను కొనుగోలు చేయకుండా వచ్చే ఏడాది పంటపై టీఆర్‌ఎస్ రాజకీయం చేస్తుందని బీజేపీ ఎంపీలు అంటున్నారు.

తీన్మార్‌ టీమ్‌కు ప్రవీణ్ కుమార్‌ గాలెం!

ఎన్నికల సమయంలో గుర్తురాని పవన్‌ ఇప్పుడు గుర్తుకొచ్చాడా ?

అప్పటి వరకు ఎందుకు ఇప్పుడు చూపించు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -