Monday, April 29, 2024
- Advertisement -

నాలుగేళ్ల‌నుంచి జ‌గ‌న్ చెప్పిన‌వే ప‌వ‌న్ గంట‌లో చెప్పారు…

- Advertisement -

జ‌గ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న విశ్వ‌రూపాన్ని చూపించాడు. ఇన్నాల్లు ప్ర‌భుత‌వానికి వ‌తాసు ప‌లుకుతున్న ప్ర‌తిప‌క్షాల వ్యాఖ్య‌ల‌కు పుల్‌స్టాప్ పెట్టారు. గుంటూరులో నిర్వ‌హించిన పార్టీ ఆవిర్భావ బ‌హిరంగ స‌భ‌లో ఎప్పుడూలేని రీతిలో టీడీపీప్ర‌భుత్వం, చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు.

ప‌వ‌న్ మాట్లాడిన ప్ర‌సంగంలో ఎక్కువ‌గా అదికార‌ప్ర‌భుత్వాన్నే టార్గెట్ చేశారు. త‌న దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌ధానంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతి, అవినీతి, అక్ర‌మాల‌పై ప్ర‌శ్నించారు. బాబుకు ఉన్న అనుభ‌వాన్ని చూసె 2014 ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తిచ్చాన‌ని చెప్పిన ప‌వ‌న్ ….ఇప్పుడు బాబును దుమ్ముదులిపారు. ప‌నిలో ప‌నిగా లోకేష్‌నుకూడా దుమ్మెత్తిపోశారు.

2019 ఎన్నికల్లో నేను తమకు మద్దతిస్తానో లేదో తెలియక ఏపీలో వైసీపీని ఎదుర్కోవడానికి ప్రతి నియోజక వర్గానికి పాతిక కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆ డబ్బంతా సర్దేశామని, ఎక్కడ దాచిపెట్టాలో అక్కడ పెట్టేశామని నిర్మొహమాటంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు.ఆడ‌బ్బంతా హెరిటేజ్‌నుంచి తీసి పెట్టార‌ని ప్రశ్నించారు. ఇక లోకేష్ చేస్తున్న అవినీతి గురించి బాబుకు తెలియ‌డంలేదాని తీవ్ర ఆరోప‌న‌లు చేశారు.

కొత్త‌గా రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఈ నాలుగేళ్ల‌లో ఏపీలో అవినీ ప్ర‌భుత్వం వ‌తాసుప‌ల‌క‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. రాజ‌ధాని నిర్మానం, భూముల కుంభ‌కోనం, విభ‌జ‌న‌హామీలు,ప్ర‌త్యేక‌హోదా సాధించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని విమ‌ర్శించారు. ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు వ‌చ్చాయిని చెబుతున్న ప్ర‌భుత్వం దాని వ‌ల్ల ఎన్నిల‌క్షల ఉద్యోగాలు వ‌చ్చాయో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ఇదంతా బాగానే ఉన్నా బాబు, ప్ర‌భుత్వం పై చేసిన ఆరోప‌న‌ల‌లో కొత్త‌వి ఏవూలేవు. అవ‌న్నీ కూడా గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా వైసీపీ అధినేత జ‌గ‌న్ చెప్పిన‌వే ప‌వ‌న్ గంట‌లో చెప్పేశారు. మొద‌టినుంచి బాబు ప్ర‌భుత్వంలో జ‌రుతున్న అవినీతి, అక్ర‌మాల‌పై ప్ర‌తిప‌క్షం వైసీపీ పోరాడుతూనే ఉంది. గ‌త నాలుగేల్లుగా సైలెంట్‌గా ఉన్న ప‌వ‌న్‌కు ఇప్పుడు జ్ణానోద‌యం అయిన‌ట్లుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -