Friday, April 26, 2024
- Advertisement -

టీఆర్ఎస్ లో ఎల్​.రమణ చేరిక ఖాయమేనా? రేపే ప్రెస్​మీట్​..!

- Advertisement -

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్​.రమణ టీఆర్​ఎస్​ లో చేరబోతున్నారంటూ జోరుగా ఊహాగానాలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఆ వార్తలను రమణ కూడా ఖండించలేదు. ఇదిలా ఉంటే రమణ .. రేపు జగిత్యాలకు వెళ్లబోతున్నారు. అక్కడ కార్యకర్తలు, అనుచరులతో సమావేశమై టీఆర్​ఎస్​లో చేరే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. టీఆర్​ఎస్​లో చేరాలని ఆయన ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు సమాచారం. రేపు కార్యకర్తలతో ఈ విషయాన్ని చర్చించనున్నారు.

మరోవైపు ఈటల రాజేందర్​ టీఆర్​ఎస్​ నుంచి వెళ్లిపోవడంతో.. ఆయన స్థానాన్ని రమణతో భర్తీచేయాలని కేసీఆర్​ భావిస్తున్నారట. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు స్పష్టమైన హామీ వచ్చాకే రమణ పార్టీ మారబోతున్నట్టు సమాచారం.గతంలో టీడీపీలో కీలక నేతగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్​రావు, తలసాని శ్రీనివాసయాదవ్​ ఈ విషయంలో మధ్యవర్తిత్వం నడిపినట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read: జూనియర్ ఎన్.టి.ఆర్​ పొలిటికల్​ ఎంట్రీపై బాలయ్య రియాక్షన్​ ఇదే..! 

ఈ క్రమంలో రేపు రమణ జగిత్యాల వెళ్లడం ఆసక్తికరంగా మారింది. జగిత్యాలలో ఆయన మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా టీఆర్​ఎస్​ లో చేరబోయే విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్టు సమాచారం. రాజకీయ భవిష్యత్​ కోసమే ఆయన పార్టీ మారబోతున్నట్టు తెలిసింది.ప్రస్తుతం తెలంగాణలో టీడీపీకి భవిష్యత్​ లేదు. ఈ క్రమంలో ఆయన టీఆర్​ఎస్​లో చేరడం ఉత్తమమని నిర్ణయం తీసుకున్నారట. రమణ టీఆర్​ఎస్​లోకి వెళ్లబోతుండటంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఖాళీ అయినట్టే.

ఇక ఆ పార్టీలో ఒకరిద్దరు తప్ప ఎవరూ మిగల్లేదు. ప్రస్తుతం టీడీపీలో రావుల చంద్రశేఖర్​రెడ్డి, నర్సిరెడ్డి, కొత్తకోట దయాకర్​రెడ్డి వంటి ఒకరిద్దరు నేతలు ఉన్నారు. వారు కూడా పార్టీలో పెద్దగా యాక్టివ్​గా లేరు. చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ టీడీపీని ఎప్పుడో వదిలేశారు. ఈక్రమంలో మిగిలిన వారు కూడా తలో దారి చూసుకోవడం ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బీసీ నేతగా, తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈటల రాజేందర్​ టీఆర్​ఎస్​ను వీడారు. దీంతో బీసీ సామాజికవర్గంలో అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంది. ఈ అసంతృప్తిని కొంతైనా చల్లార్చలన్న ఉద్దేశ్యంతో కేసీఆర్​.. రమణను టీఆర్ఎస్​లో చేర్చుకోబోతున్నట్టు సమాచారం. రమణ చేరికతో బీసీల్లో ఉన్న అసంతృప్తి చల్లారుతుందా? ఆయన ఈటల స్థానాన్ని భర్తీ చేయగలరా? అన్న విషయం వేచి చూడాలి.

Also Read: ఇలా అయితే కష్టం..! టీడీపీ క్యాడర్​ నిరుత్సాహం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -