Thursday, May 2, 2024
- Advertisement -

టిడిపి ఎమ్మెల్యే వైకాపాలో చేరడం ఖాయమా? బాబుతో భేటీకి నో…

- Advertisement -

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడం మామూలుగా జరిగే వ్యవహారమా? అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నాడంటే మాత్రం కచ్చితంగా సంచలన విషయమే. అన్నింటికీ మించి 2019 ఎన్నికల్లో 25 ఎంపి సీట్లు, మొత్తం ఎమ్మెల్యే సీట్లలో టిడిపి గెలుపు ఖాయం అని చంద్రబాబు ఘంటాపథంగా చెప్తుంటే స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలకు కూడా బాబు మాటలపై నమ్మకం లేకపోతే ఇక ప్రజలకు ఏం ఉంటుంది? ఓ వైపు గంటా శ్రీనివాసరావు లాంటి బలమైన నాయకులు వైకాపా, జనసేన పార్టీలతో టచ్‌లో ఉన్నారు. మరోవైపు ఆళ్ళగడ్డ వైకాపా టికెట్ కోసం ఎవి సుబ్బారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక తాజాగా కర్నూలు జిల్లా బనగానపల్లె టిడిపి ఎమ్మెల్యే బీసీ జనార్థనరెడ్డి కూడా వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది.

కర్నూలు జిల్లాలో మినీ మహానాడుకు, జిల్లా మహానాడుకు కూడా హాజరుకాని ఈ ఎమ్మెల్యేకు స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసి మందలించాడు. పార్టీ అభివృద్ధికి సాయపడాలని హెచ్చరించాడు. అయితే చంద్రబాబు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ……చంద్రబాబుకి షాక్ ఇస్తూ విజయవాడలో జరిగిన మహానాడుకు కూడా హాజరకాకుండా బాబు బ్యాచ్ మొత్తానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు బీసీ జనార్థనరెడ్డి. ఆ తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్‌లు ఈ టిడిపి ఎమ్మెల్యేని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే బాబు, లోకేష్‌ల ఫోన్ కాల్స్‌ని బీసీ జనార్థనరెడ్డి రిసీవ్ చేసుకోలేదు. పైగా బాబుతో మాట్లాడమన్న స్థానిక టిడిపి నేతలతో ………మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, మాట్లాడేది కూడా ఏమీ లేదు అని గట్టిగా చెప్పాడు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే చర్యలే బాబుకి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఎన్నికల ఏడాదిలో అధికార పార్టీ ఎమ్మెల్యే వైకాపాలో చేరితే అది వైకాపాకు బిగ్గెస్ట్ బూస్ట్ అవుతుంది. చంద్రబాబు పరువు పూర్తిగా పోతుంది. 2019లో టిడిపినే గెలుస్తుంది అని చంద్రబాబు చెప్పే మాటలకు విశ్వసనీయత లేకుండా పోతుంది. స్వయంగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే బాబు మాటలు నమ్మకపోతే ఇక ప్రజలు ఏం నమ్ముతారు? ప్రజల్లో అలాంటి అభిప్రాయం……..అపనమ్మకం రాకుండా చేయడం కోసమే బిసి జనార్థనరెడ్డి వైకాపాలో చేరకుండా అడ్డుకోవాలని చంద్రబాబు శతథా ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు అండ్ బ్యాచ్ బీసీ జనార్థనరెడ్డిని బుజ్జగించడంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -