Monday, April 29, 2024
- Advertisement -

గ‌వ‌ర్న‌ర్‌తో ముగిసిన కూట‌మి నేత‌ల భేటీ….

- Advertisement -

తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాలు ఉత్కంఠ‌త‌ను రేపుతున్నాయి. గెలుపుపై ఎవ‌రి ధీమా వారే వ్య‌క్తం చేస్తున్నారు. ఒక వేల హంగ్ వ‌స్తే ప్ర‌భుత్వ ఏర్పాటు ఎలా అన్న దానిపై కూట‌మి నేత‌లు ముంద జాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దానిలో భాగంగా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌శింహ‌న్ క‌లిసి లేఖ‌ను అందించారు.

కూటమికి అత్యధిక స్థానాలు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తమకే ఇవ్వాలని లేఖ‌లో గ‌వ‌ర్న‌ర్‌ను కోరినట్టు సమాచారం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు , ఎమ్మార్పీఎస్, తెలంగాణ ఇంటి పార్టీలు పోటీ చేసిన విషయాన్ని డాక్యుమెంట్ సహా గవర్నర్‌కు సమర్పించినట్టు చెప్పారు. ఎన్నికల కమిషన్‌ కు సమర్పించిన డాక్యుమెంట్లను కూడ గవర్నర్ కు అందించినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా కూటమి కొనసాగుతుందని వారు గవర్నర్‌కు తెలిపారు. కూటమి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ వివరాలను ఈ సందర్భంగా గవర్నర్‌కు అందజేశారు. కూటమి పార్టీలకు వచ్చే సీట్లను ఒకే పార్టీకి వచ్చినవిగా పరిగణించి.. మెజారిటీ వచ్చే పక్షంలో తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వారు కోరినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే, ఒకవేళ హంగ్ ఏర్పడినా సరే.. స్వతంత్ర అభ్యర్థులను తమవైపు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్లాన్‌లో కాంగ్రెస్ ఉంది.స్వతంత్ర అభ్యర్థులతో ఇప్పటికే ఆ పార్టీ పెద్దలు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రానికి ఢిల్లీ నుంచి ఏఐసీసీ పెద్దలు సైతం హైదరాబాద్ రానున్నట్టు సమాచారం.కార్నాట‌క‌లో చ‌క్రంతిప్ప‌న డీకె శివ‌కుమార్‌ను రంగంలోకి దింపుతోంది అధిష్టానం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -