Thursday, May 2, 2024
- Advertisement -

అధిష్టానంపై అసంతీప్తిగా ఉన్న మంత్రి అఖిల‌

- Advertisement -

ఆల్ల‌గ‌డ్డ‌లో ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి అఖిల ప్రియ మ‌ధ్య విబేధాలు నిగురుక‌ప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు బ‌ద్ద‌ల‌వుతాయో తెలియాని ప‌రిస్థితి. బాబు ఇద్ద‌రి మ‌ధ్య రాజీ చేసినా వారి మధ్యన విబేధాలు నివురుగప్పిన నిప్పులా ఉన్న‌య‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇటీవల టీడీపీ సైకిల్ యాత్ర, రాళ్ల దాడి ఘటన అనంతరం చంద్రబాబు అఖిల, ఏవీలను పిలిచి క్లాస్ తీసుకున్నారు. దాంతో పార్టీకోసం ఇద్ద‌రం క‌ల‌సి ప‌నిచేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అధినేత చెప్పినా వారి మధ్య మాత్రం విబేధాలు అలాగే ఉన్నాయంటున్నారు . తాజాగా ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయాల్లో ఓ వాదన వినిపిస్తోంది. ఏవీ సుబ్బారెడ్డికి అధిష్టానం ఏదైనా పదవి ఇవ్వాలనుకుంటోందని, అఖిల మాత్రం దానిని వ్యతిరేకించవచ్చునని పార్టీలోని వారు చ‌ర్చించుకుంటున్నారు.

నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన‌ట్లుగానే ప‌ద‌వి ఇచ్చేందుకు బాబు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. అయితే ఏవీకి నామినేటేడ్ ప‌ద‌వి ఇస్తే అఖిలప్రియ దేనికైనా సిద్ధమనే అభిప్రాయంతో ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. తాను ఆళ్లగడ్డలో ఉండగా ఏవీ కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తారని అఖిల ఆగ్రహంతో ఉన్నారు. ఏవీ వ్యవహారాల నేపథ్యంలో అఖిల అధిష్టానంపై కొంత అసంతృప్తితో ఉన్నారనే వార్త‌లు వినిపిస్తున్నాయి. అవ‌స‌రం అయితే పార్టీ మారేందుకైనా సిద్ధ‌మ‌నే సంకేతాలు పార్టీకీ అఖిల పంపిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అఖిలప్రియ తీరుపై కూడా అధిష్టానం అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. ఆమె తీరు అసహనానికి గురి చేస్తోందట. ఆమెకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తోంటే ఇలా చేయడం సరికాదని సీనియర్లు భావిస్తున్నారు. రాబోవు రోజుల్లో ప‌రిస్థిత‌లు ఎలా ఉంటాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -