Thursday, April 25, 2024
- Advertisement -

కార్పొరేట్ ఆసుపత్రులపై మంత్రి కొడాలి నాని ఫైర్!

- Advertisement -

ఏపిలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కరోనా రోగులను కొన్ని కార్పోరేట్ ఆసుపత్రులు నిలువునా దోచుకుంటున్నారు. పేదవారు అని కూడా చూడకుండా ఆస్తులు అమ్ముకుని వైద్యం చేయించుకోనే దుస్థితి ఏర్పడుతుంది. తాజాగాకొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు చీడపురుగులా దోచుకుతింటున్నారని ఏపీ పౌర సరఫరా శాఖామంత్రి కొడాలి నాని మండిపడ్డారు.

కష్టకాలంలో ఉన్న ప్రజలను అందిన వరకు దోచుకుతింటున్నారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఆసుపత్రులను ఉపేక్షించినా, క్షమించినా భవిష్యత్ తరాలకు ద్రోహం తలపెట్టిన వాళ్లమవుతామని వ్యాఖ్యానించారు. కరోనా రోగుల పట్ల ప్రతి ఒక్కరూ మానవత్వంతో వ్యవహరించాల్సిన సమయం అని అన్నారు.

ఈ శవాల మీద డబ్బులు ఏరుకొనే సంస్కారహీనులను అధికారులు గుర్తు పెట్టుకోవాలని.. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత కుక్క కాటుకు చెప్పు దెబ్బలా దోచుకుతినే హాస్పిటల్స్ ను అధికారులు ఫినిష్ చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో ఆలోచించి ఒకటికి ఒకరు అండగా మహమ్మారిని జయించాలని సూచించారు.

బంపర్ ఆఫర్ కొట్టేసిన యాంకర్ రష్మి

వరుణ్ తేజ్ ”గని” కోసం హాలీవుడ్ నుంచి..?

జూనియర్‌ డాక్టర్ల చర్చలు సఫలం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -