Thursday, May 9, 2024
- Advertisement -

గంటాకు ఘంట‌కొట్టిన చంద్ర‌ బాబు… భీమిలీనుంచి పోటీ చేయ‌నున్న‌ లోకేష్‌

- Advertisement -

ఏపీ మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లోకి దూక‌డానికి ఉత్సాహం చూపుతున్నారు. ఎమ్మెల్సీ ద్వారా దొడ్డిదారిన మంత్రి అయ్యాడ‌నే విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు సిద్ద‌మ‌య్యారు. త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. కొన్ని నెల‌లుగా చిన‌బాబుకోసం రాష్ట్రంలో సేఫ్ జోన్ వెత‌కిన బాబ‌కు చివ‌ర‌కి లోకేష్ పోటీ చేసె స్థానం దొరికింది. అయితే లోకేస్ సీట్ కోసం మంత్రి ఘంటాకు ఎస‌రు పెట్టారు చంద్ర‌బాబు.

లోకేష్ భీమిలీ నియోజ‌క వ‌ర్గంనుంచి దాదాపు పోటీ చేయ‌డం ఖ‌రార‌య్యింది. ఈ సంద‌ర్భంగా విశాఖ నేత‌ల‌కు బాబు సంకేతాలు ఇచ్చారు. ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా మంత్రిగా కొన‌సాగుతున్నారు. మంత్రి గంటాను విశాఖ ఎంపీగా పోటీ చేయ‌మ‌ని బాబు కోరుతున్నారు.దీన్ని బట్టి చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేష్ తొలి పోటీ విశాఖ జిల్లా భీమిలీలోనే అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది.

భీమిలీ టీడీపీకి కంచుకోట కాబట్టే బాబు…చంద్రబాబు తన కుమారుడిని ఇక్కడి నుంచీ బరిలోకి దింపుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మ‌రి గంటా విశాఖ ఎంపీగా పోటీ చేస్తారా అన్న‌ది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -