Friday, May 10, 2024
- Advertisement -

అలా చేస్తే జగన్ సర్కార్ కు చాలా నష్టం : వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు

- Advertisement -

ఏపీ ప్రభుత్వంపై నరసాపురం అధికార వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు మళ్లీ షాకింగ్ కామెంట్స్ చేశారు. న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగుతున్నట్లు కొన్ని పేపర్లో వచ్చిన వార్తలకు షాక్ అయ్యాయని అన్నారు. ఇది నిజమని తేలితే తీవ్ర ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురవ్వుతాయని అన్నారు.

ఈ మేరకు శనివారం రఘురామ ఢిల్లీలో మీడియాలో మాట్లాడుతూ.. వైసీపీ తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తోంది ఆరోపించారు. మా మాదిరిగానే న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్‌ జరిగినట్లు తేలితే ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితులు వస్తాయని ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్ చేశారు. న్యాయమూర్తుల ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎంపీ రఘరామ డిమాండ్ చేశారు.

ఇక తనపై కామెంట్స్ చేసిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి కౌంటర్ ఇచ్చారు ఎంపీ రఘురామ. ఎంపీ సీటు కోసం ఎవరి కాళ్లు పట్టుకోలేదని అన్నారు. నారాయణ స్వామి అంటే తనకు గౌరవం ఉందని, ఈ విషయంపై ఆయనతో మాట్లాడి వివరించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. అయితే ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో బీజీగా ఉంటారేమోనని తాను భావించానని, అయితే డిప్యూటీ సీఎం అయినా కూడా ఆయన్ను ఏ జిల్లాలోనూ జెండా వందనంలో పాల్గొనేందుకు ప్రభుత్వం నియమించలేదని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎంగా జెండా వందనంలో పాల్గొనపోవడంపై ఆయనకు బాధగా లేదేమో గాని, తాను మాత్రం తీవ్రంగా బాధపడుతున్నట్లు వ్యాఖ్యానించారు. తన విషయంలో డిప్యూటీ సీఎం సంయమనం పాటించాలన్నారు.

జగన్‌పై కుట్ర.. ఆసిక్తికర విషయంను చెప్పిన హీరో రామ్..!

జగన్ కు షాక్.. రాజధాని అమరావతిలో మార్పు లేదు..!

అన్ని రెడ్లకేనా.. ప్రజలు ఊరుకోరు : ఎంపీ రఘురామ

బీజేపీ మహిళా నేత సాధినేని యామినిపై కేసు నమోదు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -