Monday, April 29, 2024
- Advertisement -

నాలుగేళ్ళుగా జగన్ చెప్తున్న మాటలు, చేస్తున్న పోరాటాన్ని కాపీ కొట్టిన పవన్

- Advertisement -

శుభం….. చాలా గొప్ప విషయం…..చంద్రబాబు, పవన్‌లు ఇద్దరూ కూడా జగన్ మాటలను అందిపుచ్చుకున్నారు. కాకపోతే నాలుగేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాక, రాష్ట్రం అథోగతి దిశగా ఎన్నో అడుగులేశాక పవన్, బాబులకు తెలివి వచ్చింది. ప్యాకేజ్ పేరు చెప్పి ప్రత్యేక హోదాకు మంగళం పాడేస్తున్నారు, రైల్వే జోన్, పోలవరం, రాజధాని నిర్మాణం…..ఇలా అన్ని విషయాల్లోనూ రాష్ట్రానికి చిప్ప చూపిస్తున్నారు చంద్రబాబు……ప్యాకేజ్‌లకు కక్కుర్తిపడకు అని చెప్పి జగన్ నెత్తీ నోరు బాదుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా జగన్‌కి అనుభవం లేదు, అన్నీ పిల్ల చేష్టలు అని ఎద్దేవాచేశాడు. ప్రత్యేక హోదా కోసం నిరాహారదీక్ష చేస్తున్న జగన్‌ని తీవ్రంగా అవమానించాడు. ఇప్పుడు ఎన్నికల ఏడాదిలో మాత్రం నాలుగేళ్ళుగా జగన్ చెప్తున్న మాటలను తన మాటలుగా చెప్తున్నాడు. పచ్చ బ్యాచ్ మొత్తం జగన్ పోరాటాన్ని, మాటలను తమవిగా చెప్పుకోవడానికి ఎన్నో నాటకాలు ఆడుతూ డ్రామా రక్తికట్టిస్తోంది.

ఇక మరోవైపు పవన్ కథ కూడా సేం టు సేం. ఓటుకు కోట్లు కేసు, ఇసుక నుంచి మట్టి వరకూ చంద్రబాబు చేస్తున్న కుంభకోణాలు, అవినీతి వ్యవహారాలు, అక్రమాలపై జగన్ నాలుగేళ్ళుగా ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తూ, పోరాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఎంచక్కా బాబుకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. పైగా జగన్‌పైనే విమర్శలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు సడన్‌గా ఎన్నికల ఏడాదిలో పవన్‌కి కూడా జ్ఙానోదయమైంది. 2014 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు ఏ స్థాయిలో అవినీతి చేస్తాడో….చెప్పేవన్నీ అబద్ధాలు ఎలా ఉంటాయో దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ మేధావులకు స్పష్టంగా తెలుసు. వాళ్ళు పవన్‌ని హెచ్చరించారు కూడా. పవన్ మాత్రం ఎంచక్కా బాబుకు సపోర్ట్ చేసి నాలుగేళ్ళపాటు తెదేపా అవినీతిలో భాగమయ్యాడు. తన సినిమాలకు రాయితీలు, బ్రాండ్ అంబాసిడర్ పదవి ఇప్పించుకోవడాలు…..తెరవెనుక ప్యాకేజ్ వ్యవహారాలను ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలో తెలియక మళ్ళీ డ్రామా మొదలెట్టాడు. నాలుగేళ్ళుగా జగన్ చెప్పిన మాటలను తన నోట వినిపించాడు.

అత్యంత ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే……చంద్రబాబు, పవన్‌లిద్దరూ కూడా నాలుగేళ్ళుగా జగన్ ఏమీ చేయలేదన్నట్టుగా మాట్లాడడం……జగన్ మాటలను, పోరాటాన్ని హైజాక్ చేయాలని ప్లాన్ చేయడం. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి అండగా నిలబడతారు? పార్టీ స్థాపించినప్పటి నుంచీ ప్రజల కోసం పోరాడుతున్నవాళ్ళకా? లేక ఎన్నికల ఏడాదిలో మాత్రమే ప్రజలను గుర్తుకు తెచ్చుకునేవాళ్ళకా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -