Monday, May 6, 2024
- Advertisement -

నిజామాబాద్‌ లండ‌న్ అన్నావ్‌.. కేసీఆర్ పై మోదీ సెటైర్స్

- Advertisement -

తెలంగాణాలో ఎన్నిక‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది ప్ర‌చారంలో పార్టీల అధినేత‌లు దిగారు. భాజాపా త‌రుపు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. నిజామాబాద్ జిల్లాలో నిర్వ‌హించ‌న బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెల్ల‌డం వ‌ల్ల తెలంగాణా ప్ర‌జ‌ల‌కు ఓ పీడ వ‌దిలింద‌న్నారు. పాల‌న చేయ‌మ‌ని ప్ర‌జ‌లు ఐదు సంవ‌త్స‌రాలు అధికారం ఇస్తే …ముంద‌స్తుకు ఎందుకు వెల్లార‌ని ఒకందుకు మంచిదేన‌న్నారు.

నిజామాబాద్‌ను లండ‌న్‌గా మారుస్తాన‌ని చెప్పిన కేసీఆర్ ఎక్క‌డ‌ని ప్ర‌శ్నించారు. కానీ… ఇక్కడ కరెంట్, మంచినీటికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నేను ఇప్పుడే హెలికాప్టర్ లో వస్తూ, ఈ చుట్టు పక్కల ప్రాంతాలు ఓసారి చూసి వద్దామని పైలట్ తో చెప్పి మరీ తిరిగొచ్చాను. నాకు ఏమీ కనిపించలేదు. నేను చూసి వచ్చాను. ఇండియాలో అభివృద్ధిలో వెనుకబడివున్నాయన్న ప్రాంతాలతో పోలిస్తే, మరింతగా నిజామాబాద్ పట్టణ పరిసరాలు అధ్వాన్నంగా కనిపించాయన్నారు.

లండన్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒకసారి అక్కడికి వెళ్లి చూసి రావాలని సెటైర్ వేశారు. యూపీఏ పాలనలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్.. సోనియా గాంధీ ఉప్పు తిన్నారన్నారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేయరని అంతా ఫ్రెండ్లీ మ్యాచేనని నరేంద్రమోడీ విమర్శించారు

టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లు ఏం చేసిందో మీరు ప్రశ్నించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్లకు ముందు యువకులు, రైతులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు నిలదీసి.. టీఆర్ఎస్‌కు తగిన బుద్ధి చెప్పాలని మోడీ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -