Monday, April 29, 2024
- Advertisement -

తాడిపత్రి ఛైర్మన్ రసవత్తరం.. రహస్య శిబిరంలో నేతలు…!

- Advertisement -

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం రోజురోజుకు ఉత్కంఠ రేపుతోంది. ఎత్తులు పైఎత్తులతో పీఠంపై కూర్చునేది ఎవరా? అని ఆసక్తి కలుగుతోంది. రేపు ఛైర్మన్ ఎన్నిక ఉండటంతో.. అధికార, ప్రతిపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 18 వార్డులు గెలుచుకున్న తెలుగుదేశం.. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి మద్దతు తమకేనని ధీమాగా ఉంది.

వీరితో కలిసి 20 మంది బలం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఎక్స్‌ అఫిషియో ఓటు కోసం ప్రయత్నించిన ఎమ్మెల్సీలెవరూ… తాడిపత్రిలో ఓటు వేసేందుకు అర్హులు కాదని అధికారులు తేల్చారు. అలాగే 16 వార్డులు దక్కించుకున్న వైసిపికు ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లతో 18 ఓట్ల బలం ఉన్నా… పీఠం దక్కాలంటే మరొకరి మద్దతు అవసరం.

ఈ క్రమంలో టిడిపి, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులందరినీ రహస్యంగా శిబిరంలో దాచి కాపాడుతున్నారు.వైసీపీ నేతలు తాడిపత్రిలో అభ్యర్థుల కుటుంబ సభ్యులను, బంధువులను బెదిరించే చర్యలకు దిగుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. సీపీఐ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థి.. టిడిపి ఛైర్మన్ అభ్యర్థికే మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీష్ విప్ జారీ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -