Saturday, April 27, 2024
- Advertisement -

రాష్ట్రపతి దగ్గిరకి యువరాజు పయనం..!

- Advertisement -

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలవనుంది రాహుల్​ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్​ బృందం. డిసెంబర్​ 24న కలిసి.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2 లక్షల మంది సంతకాలు చేసిన మెమోరాండంను ఆయనకు సమర్పించనున్నారు. రాహుల్​ అధ్యక్షతన కాంగ్రెస్​ ఎంపీలు, ఇతర నాయకులు రాష్ట్రపతిని కలిసి ఈ వినతిపత్రాన్ని సమర్పించడంతో పాటు, ప్రజాసంక్షేమం దృష్ట్యా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ ఓ ప్రకటన విడుదల చేశారు. 3 వ్యవసాయ చట్టాలు రైతులకు తీవ్ర వేదన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

కేంద్రం తెచ్చిన చట్టాల రద్దులో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని, సెప్టెంబర్​ నుంచి కాంగ్రెస్​ సంతకాల సేకరణ మొదలుపెట్టింది. కూలీలు, రైతులు, వ్యాపారుల నుంచి మొత్తం 2 కోట్లకుపైగా సంతకాలు సేకరించింది.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్​ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోట్లేదని, ఇప్పటికే 44 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -