ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌కు భారీ షాక్‌..!

- Advertisement -

ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌కు హైకోర్టు షాకిచ్చింది. ప్ర‌భుత్వ వాద‌న‌లు, సుప్రీంకోర్టు ఆదేశాలు ప‌ట్టించుకోకుండా ఎస్ఈసీ జారీ చేసిన గ్రామ పంచాయ‌తి ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ర‌ద్దు చేసింది. ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం స‌రికాద‌ని, క‌రోనా క‌ట్ట‌డికై ఉద్దేశించిన వ్యాక్సినేషన్ ప్రక్రియకు షెడ్యూల్ అవరోధం అవుతుందని పేర్కొంది. ప్ర‌జ‌ల ఆరోగ్య‌మే ప్ర‌థ‌మ ప్రాధాన్యం అని స్ప‌ష్టం చేసింది.

కాగా ఓవైపు కోవిడ్ స్ట్రెయిన్ భ‌యాలు వెంటాడుతున్న త‌రుణంలో ఎస్‌సీఈ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.దీంతో నిమ్మ‌గ‌డ్డ తీరుపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌జ‌ల ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం స‌రికాద‌ని అధికార పార్టీ నాయ‌కులు, ఉద్యోగ సంఘాల నేత‌లు పేర్కొన్నారు. రాజ‌కీయ దురుద్దేశంతో ఆయ‌న ఇలా చేశార‌ని ఆరోపించారు.

- Advertisement -

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. ఏపీ ప్ర‌భుత్వం క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌మ‌ని స్ప‌ష్టంగా చెప్పింది. అయినా ఎస్ఈసీ నిమ్మ‌‌గ‌డ్డ ప‌ట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం హైకోర్టుకు వెళ్లింది. షెడ్యూల్ ర‌ద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని పిటిష‌న్ వేసింది. దీనిపై కోర్టు సోమ‌వారం విచార‌ణ జ‌రిపింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ.. షెడ్యూల్ ర‌ద్దు చేయాల‌ని ఎస్ఈసీని ఆదేశించింది.

పార్టీ పెట్టేందుకు ఆ ముగ్గురు సిద్ధం

మూడు పార్టీలకు విషమ పరీక్షగా ఉపఎన్నిక

40 ఏళ్ళ దాటుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

త్వరగా భోజనం చేయటం లేదా? అయితే ఇది చదవండి!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...