Friday, April 26, 2024
- Advertisement -

కేటీఆర్ కేబినెట్‌లో ప‌ద‌వుల కోసం లొల్లి!

- Advertisement -

దుబ్బాక ఉప ఎన్నిక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కాషాయ ద‌ళం దూకుడు మ‌రింత‌గా పెరిగింది. వ‌రుస విజ‌యాల‌తో జోరు మీదున్న బీజేపీ నేత‌లు అధికార టీఆర్ఎస్ ల‌క్ష్యంగా ఘాటు విమ‌ర్శ‌లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ ఈ విష‌యంలో ముందు వ‌రుస‌లో ఉంటారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఆయ‌న కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మాట‌ల దాడి చేసే ఆయ‌న ఆదివారం మ‌రోసారి త‌న‌దైన శైలిలో వాగ్బాణాలు వ‌దిలారు.

ఇటీవ‌ల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో సీఎం కేసీఆర్ య‌శోద ఆస్ప‌త్రిని సంద‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బండి సంజ‌య్ హైద‌రాబాద్‌లో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రి చేయ‌డానికి కేసీఆర్ అనారోగ్యాన్ని సాకుగా చూపాలా? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉండాలని తాను కోరుకుంటున్నాన‌న్న సంజ‌య్‌.. కేటీఆర్‌ కేబినెట్‌లో పదవుల కోసం ఇప్ప‌టికే అధికార పార్టీ టీఆర్ఎస్‌లో అంత‌ర్యుద్ధం జ‌రుగుతోంద‌న్నారు. ఒక‌వేళ త‌మ‌ను కేటీఆర్‌ కేబినెట్‌లోకి తీసుకోకపోతే… సొంత పార్టీ పెట్టేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటూ సంచ‌ల‌నానికి తెర‌తీశారు.

ఇక సీఎం కేసీఆర్ ఉప‌యోగించే భాష గురించి బండి సంజ‌య్ ప్ర‌స్తావిస్తూ తాను ఆయ‌న ద‌గ్గ‌రే భాష నేర్చుకోవాల‌ని సెటైర్లు వేశారు. కేవ‌లం కమీషన్ల కోసమే తెలంగాణ సీఎంఓ ప‌నిచేస్తుంద‌ని ఆరోపించారు. పోలీసుల ద‌గ్గ‌ర కూడా సీఎంవో అధికారులు కమీషన్లు తీసుకున్నారని తీవ్ర ఆరోప‌ణ‌లు చేసి పొలిటిక‌ల్ హీట్ రాజేశారు. ఇక గ్రేట‌ర్ ఎన్నిక‌ల స‌మ‌యంలో బండి సంజ‌య్ భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి ఆల‌యంలో ప్ర‌మాణం, పాత‌బ‌స్తీలో స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేస్తామంటూ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం స్రుష్టించిన సంగ‌తి తెలిసిందే.

ఆయ‌న నాకు అంకులే.. కానీ: అర్వింద్ సంచ‌ల‌న

మూడు పార్టీలకు విషమ పరీక్షగా ఉపఎన్నిక

ఇప్ప‌టికే ర‌చ్చ ర‌చ్చ‌.. మ‌రోసారి

ఆయ‌నొక్క‌రే ప్ర‌భుత్వ ఉద్యోగా.. మీరు మార‌రా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -