Wednesday, April 24, 2024
- Advertisement -

కాకతీయగడ్డపై రుద్రమ తర్వాత మళ్లీ షర్మిలే.. !

- Advertisement -

తెలంగాణ‌లో కొత్తగా రాజ‌కీయ అడుగులు వేస్తున్న ష‌ర్మ‌ల ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఎత్తి చూపుతూ.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు సందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఇటీవ‌ల ఖ‌మ్మంలో ఏర్పాటు చేసిన పార్టీ సంక‌ల్ప స‌భ‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. ప్ర‌జ‌లు సైతం భారీగానే హాజ‌ర‌య్యారు.

ఇదిలా ఉండ‌గా, తాజాగా ష‌ర్మిల తెలంగాణ‌లో ఉద్యోగాలు లేక యువ‌త తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌నీ, వెంట‌నే ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లనేటు వంటి ప‌లు డిమాండ్ల‌తో హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్కు వ‌ద్ద 72 గంట‌ల దీక్ష‌కు దిగారు. ష‌ర్మిల చేప‌ట్టిన ఈ దీక్ష‌కు తెలంగాన యువ‌త‌తో పాటు ప‌లువువురు సామాజిక కార్య‌క‌ర్త‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.

తాజాగా ష‌ర్మిల చేప‌ట్టిన ఈ దీక్ష‌కు ప్రముఖ సామాజికవేత్త, రచయిత కంచె ఐలయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్యతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు మ‌ద్ద‌తు తెలిపారు. కంచె ఐల‌య్య మాట్లాడుతూ… కాకతీయ గడ్డ మీద రుద్రమదేవి తర్వాత మళ్లీ షర్మిలను చూస్తున్నానని ప్ర‌శంసించారు. ఆమెను సమ్మక్క – సారక్క వారసురాలుగా అభివ‌ర్ణించారు.

టీకా తీసుకన్న సర్పంచ్ మృతి

కీర‌దోస‌.. బరువు త‌గ్గించే సులువైన మార్గం..!

తేలిక‌గా తీసుకోవ‌ద్దు.. క‌రోనాపై ఎయిమ్స్‌ చీఫ్‌ వార్నింగ్‌!

నవీన్ పోలిశెట్టికి పెరుగుతున్న డిమాండ్!

తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -