Wednesday, May 1, 2024
- Advertisement -

కొత్త వారికి నో ఛాన్స్.. కే‌సి‌ఆర్ వ్యూహం ఫలిస్తుందా ?

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ వచ్చే ఎన్నికలపై గట్టిగా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రం ఏర్పడినది మొదలుకొని గత ఎన్నికల వరకు తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తున్న టి‌ఆర్‌ఎస్ పార్టీకి ఏసారి మాత్రం బీజేపీ రూపంలో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ముచ్చటగా మూడవసారి అధికారం చేజిక్కించుకోవాలన్నా.. టి‌ఆర్‌ఎస్ కు తిరుగులేదని నిరూపించాలన్నా ఈసారి ఎన్నికల్లో గెలవడం చాలా ముఖ్యం. మరోవైపు కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లోకి చక్రం తిప్పలన్న, బీజేపీని కేంద్రంలో ఢీ కొట్టే సత్తా కే‌సి‌ఆర్ కు ఉందని రుజువు చేయాలన్న.. వచ్చే సార్వత్రిక ఎన్నికలు కే‌సి‌ఆర్ కు అత్యంత కీలకమే. .

అందుకే ఎన్నికలకు మరో 10 మాత్రమే సమయం ఉండడంతో.. ఇప్పటి నుంచే తన వ్యూహరచనకు పదును పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా సిట్టింగ్ స్థానాలను మార్చే సమస్యే లేదని పాతవారికే అవకాశం కల్పిస్తామని, ఇటీవల కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు. దీంతో ఈసారి టికెట్ ఆశించేవారికి నీళ్ళు చల్లినట్లైంది. వాళ్లనుంచి అడపాదడప అసమ్మతి సెగలు తగిలే అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఎన్నికల సమయంలో పార్టీ పిరాయింపులు సహజం. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఇతర పార్టీల నుంచి టి‌ఆర్‌ఎస్ లో చేరి పార్టీ టికెట్ ఆశించే వచ్చే వారికి కే‌సి‌ఆర్ చేసిన వ్యాఖ్యలు డైలమాలో పడేసినట్టే. మరి టికెట్ ఆశించే అసమ్మతి నేతలను కే‌సి‌ఆర్ ఎలాంటి బుజ్జగింపు చర్యలు చేస్తారో చూడాలి.

అయితే కే‌సి‌ఆర్ పాతవారికే ప్రాధాన్యం ఇవ్వడం వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీకి బీజేపీ రూపంలో గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి రిస్క్ లో పడడం కన్నా.. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే లకే సీట్లు కేటాయించడం మేలు అనే భావనలో కే‌సి‌ఆర్ ఉండే అవకాశం ఉందని విశేల్శకులు చెబుతున్నారు. ఇక ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండడంతో నిత్యం ప్రజల్లో ఉండాలని, టి‌ఆర్‌ఎస్ నేతలతో, ఎమ్మెల్యేలతో ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో చెప్పుకొచ్చారు కే‌సి‌ఆర్. ఇక అదే విధంగా ముందస్తు ఎన్నికలు కూడా ఉండబోవని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కూడా స్పష్టం చేశారు. మరి ఈసారి ఎన్నికలు కే‌సి‌ఆర్ కు అత్యంత కీలకం కాగా ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇదే చివరి ఎలక్షన్.. బాబు క్లారిటీ !

తెలంగాణలో కూడా పవన్ పొత్తు ఉంటుందా ?

ఈసారి గెలిస్తే మరో 30ఏళ్ళు మనమే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -