Monday, April 29, 2024
- Advertisement -

ఇదే చివరి ఎలక్షన్..నిజమేనా ? వ్యూహమా ?

- Advertisement -

తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబు నాయిడు మూడు రోజుల పర్యటనలో భాగంగా ఉమ్మడి కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా పత్తికొండలో నిర్వహించిన రోడ్ షో అనంతరం బహిరంగ సభలో మాట్లాడినా బాబు.. పలు కీలక వ్యాఖ్యాలు చేశారు. తనను ఈసారి ఎన్నికల్లో గెలిపించాలని లేదంటే ఇదే చివరి ఎన్నిక అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బాబు. సీనియర్ పొలిటీషియన్ అయిన తనను ఎంతో అవమానించారని, చివరికి తన బార్యను కూడా దారుణంగా అవమానించారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అసెంబ్లీ కౌరవ సభగా మారిందని, దానిని గౌరవ సభగా మార్చేందుకు ప్రజల ఆశీర్వాదం కావాలంటూ బాబు విన్నవించుకున్నారు.

ముఖ్యమంత్రి అయిన తరువాత తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతానన్న మాటను గుర్తు చేస్తూ..ఈసారి మీరు గెలిపించకపోతే ఇదే నా చివరి ఎన్నిక అవుతుందని ఎవరు ఊహించని విధంగా కామెంట్స్ చేశారు చంద్రబాబు. అయితే బాబు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనే దానిపై పోలిటికల్ సర్కిల్స్ లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బాబు సింపతీ గేమ్ ఆడుతున్నడని కొందరు చెబుతుంటే.. కాదు నిజమే చెబుతున్నాడనేది మరికొందరి వాదన. అయితే విశ్లేషకులు చెబుతున్నా ప్రకారం బాబు వ్యాఖ్యలలో సింపతీ మాత్రమే కాకుండా కొంత మేర నిజం కూడా ఉంది.

ఎందుకంటే బాబు ఎన్నికల నాటికి 73 సంవత్సరాలు.. ఇక వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం తేడా కొట్టిన మరో అయిదెండ్ల వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి అప్పటికి 80ఏళ్ళకు చేరువౌతారు చంద్రబాబు. దాంతో ఇప్పుడున్నంత చురుకుగా అప్పుడు ఉండే అవకాశం లేదు. మక్సిమమ్ పాలిటిక్స్ కు రిటైర్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు టీడీపీకి అత్యంత కీలకం. ఒకవేళ టీడీపీ గెలిస్తే లోకేశ్ ను బలమైన రాజకీయ నేతగా తీర్చిదిద్ది.. చంద్రబాబు రిటైర్ అయ్యే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు ” ఇదే తన చివరి ఎన్నిక ” అని చెబుతూ ప్రజల్లో సింపతీ సంపాదించుకునే ప్రయత్నం చూస్తున్నదనేది ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. బాబు వ్యూహాత్మకంగా ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ అందులో నిజం కూడా లేకపోలేదు. మరి బాబు అనుసరిస్తూన్న సెంటిమెంట్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఈసారి గెలిస్తే మరో 30ఏళ్ళు మనమే !

తెలంగాణలో కూడా పవన్ పొత్తు ఉంటుందా ?

కర్నూల్ పై బాబు ఫోకస్.. వ్యూహం ఫలిస్తుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -