Thursday, May 9, 2024
- Advertisement -

భవిష్యత్‌ రాజకీయాలు అత్యంత భయానకం అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అవసరం లేదు…

- Advertisement -

తమిళనాడులో అధికార పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు క‌ప‌డ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.సొంత‌ పార్టీ నుంచి బయటకు వెళ్ళడమే ఆ 18 ఎమ్మెల్యేలు చేసిన నేరం. దినకరన్‌ వర్గంగా ప్రచారంలో వున్న ఆ 18 మంది ఎమ్మెల్యేలతో, తమ ప్రభుత్వానికి ప్రమాదం పొంచి వున్న దరిమిలా, వ్యూహాత్మకంగా పళనిసామి సర్కార్‌, ఆ 18 మందిపైనా స్పీకర్‌తో వేటు వేయించింది. ఎమ్మేల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌డం అనేది స్పీక‌ర్ విచ‌క్షాణాది కారం మీద‌నె ఆధార‌ప‌డింద‌నేది వ‌రే విష‌యం.

త‌మిళ‌నాడు స‌ర్కార్ తీసుకున్న ఈ నిర్ణ‌యం వైసీపీకి ఆయుధంగా మారింది. తమ పార్టీకి చెందిన 20 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అమలు చేయాలనే డిమాండును వైసిపి తెరపైకి తేనుంది. 2014లో వైసిపి నుంచి గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై వైసిపి కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తోంది. అయితె ఇక్కడ మాత్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడదుఎందుకంటె ప్ర‌భుత్వానికి ప్ర‌మాదం.

కోడెలపై ఒత్తిడి, ఆ వ్యూహానికి మరింత పదును పెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఫిరాయింపులపై స్పీకర్ కోడెల శివప్రసాద్.. తమిళనాడు స్పీకర్ ధనపాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలనే డిమాండును వైసిపి తెరపైకి తీసుకు రానుంది. ఈ వ్యూహానికి మరింత పదును పెట్టనుంది. అక్క‌డ కేవలం సీఎంకు ఓటు వేయమని చెప్పినందుకే ధిక్కరణ కింద వేటు వేస్తే, ఇక్కడ 20 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడో పార్టీ మారి, కేబినెట్లో చేరినా చర్యలు తీసుకోకపోవడాన్ని వైసిపి గట్టిగా నిలదీయనుంది.

తమిళ స్పీకర్ నిర్ణయాన్ని ఆధారంగా చేసుకుని మరొకసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేయాలని వైసిపి నిర్ణయించింది. తమిళ స్పీకర్ నిర్ణయాన్ని ఆధారంగా చేసుకుని మరొకసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేయాలని వైసిపి నిర్ణయించింది. కాగా, అనర్హతపై తక్షణం స్పందించి తమిళనాడు స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఏపిలోనూ అమలుచేసి, పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వైసిపి మళ్లీ తాజాగా కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -