Tuesday, May 7, 2024
- Advertisement -

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్…

- Advertisement -

టీడీపీ హయాంలో బాబు అండతో రెచ్చిపోయిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎంతలా అంటే కేసులకు భయపడి గత కొన్ని రోజులుగా అజ్ణాతంలో గడుపుతున్నారు. అధికారులను ఇష్ఠారాజ్యం గా మాట్లాడిన చింతమనేని చివరకు జైలు పాలయ్యారు.

పదిరోజుల క్రిందట చింమనేనిపై ఏడు కేసులను నమోదు చేశారు. అతనిపై ఎక్కువగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులే నమోదయ్యాయి. అప్పటినుంచి అరెస్ట్ నుంచి తప్పుంచుకొనేందుకు ఆయన అజ్ణాతంలో ఉన్నారు. చింతమనేని కోసం 12 పోలీస్ టీంలుగా గాలిస్తున్నాయి.ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య చింతమనేని బుధవారం ఉదయం దుగ్గిరాలలోని తన ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన అనుచరులు రెచ్చిపోయారు. చింతమనేని నివాసంలో ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లను అనుచరులు నిర్బంధించారు. ఈ క్రమంలో భారీగా మోహరించిన పోలీసులు చింతమనేని అరెస్టు చేశారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా పలు అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి చింతమనేనిపై పోలీసులు 10 కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తన అరెస్ట్ పై చింతమనేని స్పందించారు.

అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసేందుకు తాను వచ్చానని, కానీ పోలీసులు ఏ విధమైన విచారణ చేపట్టకుండానే అరెస్ట్ చేశారని ఈ సందర్భంగా చింతమనేని విమర్శించారు.తనపై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగంగానే కేసుల్లో ఇరికించారని, న్యాయ పోరాటంలో తానే గెలుస్తానని అన్నారు.పోలీసుల వాహనాలు ముందుకు కదలకుండా ఆయన అనుచరులు అడ్డుకోగా, పోలీసులు వారిని చెదరగొట్టారు. కాగా, చింతమనేనిని స్టేషన్ కు తీసుకెళ్లి విచారిస్తారా? లేక నేరుగా న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్తారా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -