Saturday, April 27, 2024
- Advertisement -

ప్రత్యేకహోదా అంశం టీడీపీకు మైలేజ్..వైఎస్ఆర్ సీపీకు డామేజ్

- Advertisement -

అదను చూసి దెబ్బకొట్టడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని మించిన వారు లేరు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు ఆయన. రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ అవసరాలు ఉంటే ఎంత దూరమైనా వెళ్తారు. ఎంత కష్టమైనా పడతారు. ముఖ్యంంగా చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు తిరుగే ఉండదని అనేకమంది సీనియర్ నాయకులు పార్టీలకు అతీతంగా చెబుతుంటారు. ఇతర పార్టీలతో పొత్తుల కోసం ఎంత తాపత్రయ పడతారో..నష్టం జరుగుతుందంటే వదిలించుకోవడానికీ అంతే తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. నాలుగేళ్లు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా, బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరించిన చంద్రబాబు అందుకు తగ్గట్టే మిత్రధర్మం పాటించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతించారు. రాష్ట్రానికి కేంద్రం కచ్చితంగా న్యాయం చేస్తుందని పలు సందర్భాల్లో ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే కేంద్ర నిదులతో ఏపీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందితే, ప్రత్యేకహోదాతో మరింత వేగంగా అభివృద్ధి ఫలాలను అందుకుంటే చంద్రబాబుకు వచ్చే పేరు ప్రఖ్యాతలు అంతా ఇంతాకావు. ఇప్పటికే జాతీయ స్థాయి పార్టీలు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్న చంద్రబాబు ఈ సారి ఏకంగా ప్రధాని రేసులోకి వచ్చేయడం ఖాయం. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన సీనియర్ నాయకుడిగా ప్రధాని పదవికి కావాల్సిన అన్ని అర్హతలు ఆయనకున్నాయి. దీంతో మోడీ తన సంకుచిత బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. హోదా సహా ఏపీకీ రావాల్సిన న్యాయబద్ధమైన నిధులు, ఇతర అంశాలపైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల దృష్య్టా ఏపీకి అన్యాయం చేస్తున్నారు. ఇంక ఆ పార్టీతో కొనసాగితే నిండా మునిగిపోవడం ఖాయమని పసిగట్టిన చంద్రబాబు రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని, కేంద్ర మంత్రి పదవులకు తమ పార్టీ నాయకులతో రాజీనామా చేయించేశారు. వెంటనే స్వరం పెంచారు. మోడీ చేసిన మోసాలపై గర్జిస్తున్నారు. ఏ నిమిషమైతే ఎన్డీఏకి గుడ్ బై చెప్పారో…అదే నిముషం నుంచీ మోడీనీ, బీజేపీని టార్గెట్ చేస్తూ సవాళ్లు, ప్రతిసవాళ్లు, వాగ్భాణాలతో చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ఆయన పార్టీ ఎంపీలు కూడా ఎక్కడా తగ్గడం లేదు. దీంతో నాలుగేళ్లు వాళ్లు హోదాపై ఏం మాట్లాడారన్నది ఇప్పుడు అప్రస్తుతంగా మారిపోతోంది. ప్రస్తుతం ఏంటి ? భవిష్యత్ ఏంటి ? అనే అంశాలకే ప్రాధాన్యం పెరుగుతోంది.

మరోవైపు టీడీపీ ఎంపీలు రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేకహోదా సాధన కోసం ఏదోలా తమ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. మొన్నమోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో పాటు, రాజ్యసభలోనూ చర్చకు నోటీసులు ఇచ్చి, చర్చ జరిపించారు. ఇంకో వైపు ఏదో రీతిలో రోజూ పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు తమ నిరసన గళం వినిపిస్తన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్ని పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తాజాగా టీడీపీ ఎంపీలు తమ నిరసన గళాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వినిపించారు. విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం, ఏర్పాటుతో పాటు ఆరు కోట్ల ఆంధ్రలకు పార్లమెంట్ సాక్షిగా ఓ ప్రధాని ఇచ్చిన హామీని ప్రస్తుత ప్రధాని వస్మరించడంపై రాష్ట్రపతి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని విన్నవించుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్రపతి వద్ద తమ ఆకాంక్షను వెళ్లబుచ్చారు. ఏపీ ప్రజల మనోభావాలకు చెందిన అంశాలు కనుక, ముఖ్యంగా ప్రత్యేకహోదా రాష్ట్రానికి జీవనాడి కనుక హోదా ఇచ్చే దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్రపతికి విన్నవించుకున్నారు. తమ విన్నపాలపై ఆయన సానుకూలంగా స్పందించారని తర్వాత టీడీపీ ఎంపీలు మీడియాతో చెప్పుకొచ్చారు.

మొత్తానికి ఏదో రకంగా టీడీపీ ఎంపీలు తమ స్వరం వినిపిస్తూ రోజూ మీడియాలో జనంలో ప్రత్యేకహోదాపై హడావుడి చేస్తున్నారు. దీంతో వారికి ఎంతోకొంత మైలేజ్ పెరుగుతోంది. ప్యాకేజ్ ముద్దు, హోదా వద్దు అన్న వాళ్లే నేడుతప్పు తెలుసుకున్నారు.పోరాటం చేస్తున్నారు అనే మాట జనంలో వినిపిస్తోంది. కానీ నాలుగేళ్లు హోదాపై మాట్లాడిన వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఇప్పుడు రాజీనామాలు ఆమోదించుకుని, నీరుగారిపోయారు. వారి స్వరం సాక్షిలోతప్ప బయట ఎక్కడా వినిపించడం లేదు. కనిపించడం లేదు. అందుకే టీడీపీకి మైలేజ్ పెరుగుతోంటే, వైఎస్ఆర్ సీపీకి డామేజ్ పెరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -