Saturday, April 27, 2024
- Advertisement -

ఈస‌ర్వేలో కూడా దిమ్మ‌తిరిగే నిజాలు….

- Advertisement -

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా..ఏ ఇద్ద‌రు మాట్లాడ‌కున్నా నంద్యాల ఉప ఎన్నిక‌పైనె చ‌ర్చ జోరుగా సాగుతోంది.నంద్యాలలో ఎవరు గెలుస్తారన్న చర్చ తప్పనిసరి అన్న వాదన వినిపిస్తోంది. అంటే నంద్యాల బైపోల్స్ ఏ స్థాయిలో హీట్ పెంచిందో ఇట్టే చెప్పేయొచ్చు. ఎన్నిక ఫ‌లితంపై ఏపీతోపాటు తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు.అయితే ఇప్పుడు తాజాగా కేసీఆర్ స‌ర్వే రాజ‌కీయ ప‌ర్టీలో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.

నంద్యాల ఉప ఎన్నిక‌పై స‌ర్వేల రారాజు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వే హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌గా…ఇప్పుడు కేసీఆర్ లేటెస్ట్ స‌ర్వే అదికార‌పార్టీలో గుబులు రేపుతోంది.స‌ర్వేవివిరాల‌నుస్వ‌యంగాకేసీఆర్బాబుతోచెప్పిన‌ట్లుస‌మాచారం.స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ హైదరాబాదులోని రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ఈ స‌మావేశానికి ఇరు రాష్ట్రాల ప్ర‌జాప్ర‌తినిధుల‌తోపాటు ఇద్ద‌రు చంద్రుల్లు హాజ‌ర‌య్యారు. ఇద్ద‌రి మ‌ధ్య నంద్యాల ఎప ఎన్నిక‌పై చ‌ర్చ‌జ‌రింగింది. నంద్యాల‌లో గెలుపు టీడీపీదేన‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ మాత్రం పెద్ద‌షాక్ ఇచ్చారంట‌. స‌ర్వేలో వ‌చ్చిన ఫ‌లితాల‌ను బాబుకు చెప్ప‌డంతో కంగుతిన్నారంట‌. అభ్య‌ర్తే పెద్ద‌మైన‌స్ పాయంట్ అని..జ‌గ‌న్ రోడ్‌షో వైసీపీ కి బాగా క‌ల‌సి వ‌స్తోంద‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం.

ప్ర‌ధానంగా శిల్పాకు స్థానిక బ‌లం క‌ల‌సి వ‌స్తుండ‌టంతోపాటు…టీడీపీకి సానుభూతి ఎటువంటి ప్ర‌భావం చూప‌ద‌ని చెప్పారంట‌. భూమా పేరు చెప్ప‌కుండా ఒక్క అభివృద్దిని మాత్ర‌మే ప్ర‌చారం చేస్తుండ‌టంతో ఆయ‌న వ‌ర్గీయులు అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

త‌న ఎన్నిక‌ల స‌ర్వే ప్ర‌కారం నంద్యాల‌లో వైసీపీ గెలుస్తోంద‌ని…చివ‌రిలో ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప టీడీపీ గెల‌ద‌న్నారంట‌. ప్ర‌స్తుతానికి వైసీపీకె గెలుపు అవ‌కాశాలు ఉన్న‌ట్లు చెప్పిన‌ట్లు స‌మాచారం.కేసీఆర్ వ్యాఖ్య విన్న వెంటనే చంద్రబాబు ముఖం వాడిపోయిందని కూడా అక్కడున్న వారు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -