Wednesday, May 8, 2024
- Advertisement -

ఎమ్మెల్యే గా గెల‌వ‌కుండానే ప్ర‌మాణ స్వీకారం చేసిన బండ్ల గ‌ణేష్‌..ఎక్క‌డా…?

- Advertisement -

ఆలూ లేదు…సూలూ లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్న సామెత‌లాగా త‌యార‌య్యింది కాంగ్రెస్ నేత బండ్ల గ‌ణేష్ ప‌రిస్తితి. బండ్ల పార్టీలో జాయిన్ అయిన వెంట‌నే ఆవేశంతో ‘బండ్ల గణేష్ అను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యుడిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని నా తెలంగాణ ప్రజల సాక్షిగా ప్రమాణం చేయబోతున్నాను’ అంటూ టిక్కెట్ల జాబితా విడుదల కాకుండానే ‘ఆగలేకపోతున్నాను సార్.. ఆశగా, ఆతృతగా ఉంది’.. అంటూ కాంగ్రెస్‌లో జాయిన్‌ అయిన ఉత్సాహంలో అపుడెపుడో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేశారు బండ్ల గణేష్. ఇది అంద‌రికీ గుర్తే ఉంటుంది.

మ‌హాకూట‌మిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్తుల‌కు సంబంధించి రెండు జాబితాల‌ను విడుద‌ల చేసింది. రెండు జాబితాలలో బండ్ల గ‌ణేష్‌కు షాక్ ఇచ్చింది. టిక్కెట్ల ప్రకటన లేదు.. నామినేషన్స్ లేదు.. ఎన్నికలు కాలేదు.. రిజల్ట్ ఇవ్వలేదు.. అప్పుడే మీరు ప్రమాణ స్వీకారం ఎలా చేయాలో ప్రిపేర్ అయిపోయారా అంటే.. ఇందులో డౌట్ ఏముంది సార్.. కన్ఫామ్ కదా.. మరో రెండు నెలల్లో ఎలాగూ చేయబోయేదే కదా అందుకే మాట్లాడుతున్నా.. అసెంబ్లీలోకి వెళ్లి అధ్యక్షా అనడం ఖాయం అంటూ ధీమాగా చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన త‌ర్వాత మీరు ఎక్క‌డ‌నుంచి పోటీ చేస్తార‌ని ప్ర‌శ్నించ‌గా షాద్ నగర్, జూబ్లీ హిల్స్, రాజేంద్రనగర్ ఇలా ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అంటూ తొడకొట్టి మరీ ఎన్నికల సిద్ధం అన్నారు నాటి కమెడియన్ నేటి పొలిటీషియన్ బండ్ల గణేష్.

బండ్ల గణేష్ ఆశించిన షాద్‌నగర్‌ స్థానం సైతం సి. ప్రతాప్ రెడ్డికి కేటాయించారు. సో.. బండ్ల గణేష్‌కి జూబ్లీ హిల్స్, షాద్ నగర్, రాజేంద్రనగర్‌లు ఒక్కొక్కటిగా చేజారిపోయాయి. మ‌రి ఇప్పుడు ఏపార్టీనుంచి గెలుస్తారో ..ఎలా ప్ర‌మాణ స్వీకారం చేస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -