సమాధిలోకి వెళ్లానన్న నిత్యానంద

- Advertisement -

తాను బతికే ఉన్నానంటూ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యనంద స్వామి ప్రకటించారు. తన మరణంపై వస్తున్న వార్తలను ఖండించారు. ప్రస్తుతం సమాధి స్థితిలో ఉన్నానంటూ ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టాడు. ఈక్వెడార్ కు సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్న నిత్యానంద.. కొన్ని రోజుల క్రితం ఆనారోగ్యానికి గురై చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.

దీనిపై స్పందించిన నిత్యానంద..తాను సమాధిలోకి వెళ్లాననీ.. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నానన్నారు. అందుకు కాస్త సమయం పడుతుందని తెలిపారు. మనుషులు, పేర్లు, ప్రాంతాలను గుర్తుపట్టలేకపోతున్నాననీ..27 మంది వైద్యులు తనకు చికిత్స చేస్తున్నట్లు ..ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

- Advertisement -

భారత్ లో లైంగిక ఆరోపణలు రావడంతో 2019 నవంలో దేశం వదిలి పారిపోయారు. కైలాస్ అనే ద్వీపానికి ప్రధానిగా ప్రకటించుకున్నారు. సొంత కరెన్సీనీ , రిజర్వ్ బ్యాంక్ ను ఏర్పాటు చేసుకున్నారు.

ఉచితాలు కొంప ముంచుతాయ్

ప్రభాస్.. హీరో కాదు టైగర్

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -