Sunday, April 28, 2024
- Advertisement -

మూడు భాషల.. ప్రమాణ స్వీకారం..!

- Advertisement -

నూతనంగా ఎంపికైన జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లకు కలెక్టర్‌ శ్వేతా మహంతి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ పార్టీల విజ్ఞప్తి మేరకు.. వారికి అనుకూలమైన భాషలో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. మొత్తం 193 మందికి గాను 97 మంది సభ్యులు ఉంటే ఎన్నిక నిర్వహించనున్నారు. ఏ అభ్యర్థికి ఎక్కువ మంది చేయి లేపుతారో వారినే మేయర్‌గా ప్రకటించనున్నారు.

తొలుత తెలుగులో ప్రమాణం చేయించాలనుకున్న కార్పొరేటర్లతో… శ్వేతా మహంతి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఉర్దూ, హిందీ, ఆంగ్లంలో సభ్యులతో ఎన్నికల నిర్వహణ అధికారి సామూహికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత సభ్యుల నుంచి సంతకంతోపాటు జీహెచ్​ఎంసీ పంపిన లేఖ, ఎన్నికల సంఘం ఇచ్చిన గెలుపు పత్రం లేఖలను అధికారులు వారి వద్ద నుంచి సేకరించారు.

వడివడిగా పోలవరం.. స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తి

డ‌బ్బుల వ‌ర్షం కురిపిస్తానంటూ.. ఏకంగా యువ‌తినే..?

షర్మిల పార్టీ ప్రకటనపై స్పందించిన హరీష్ రావు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -