Saturday, April 27, 2024
- Advertisement -

జగన్‌తో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేల మిలాఖత్… రాజీనామా చేసి రావాలన్న జగన్

- Advertisement -

తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచింది అన్నట్టు వైకాపా నుంచి ఎమ్మెల్యేలను కొనేసి జగన్‌ని రాజకీయాల నుంచే సాగనంపేద్దాం అని అని అనుకున్న చంద్రబాబుకు ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకవైపు మోడీ గురించి, కేంద్ర ప్రభుత్వ అన్యాయం గురించి డైరెక్ట్‌గా మాట్లాడే ధైర్యం లేక పచ్చ మీడియాకు లీకులు ఇస్తూ బ్రతకాల్సిన పరిస్థితి. మరోవైపు ఈ చేతకానితనాన్ని టిడిపి ఎమ్మెల్యేలు కూడా ఈసడించుకుంటున్నారు. ఇక జేసీలాంటివాళ్ళయితే ఏకిపడేస్తున్నారు. జంపింగ్ ఎంపీలు ఆల్రెడీ బాబును తిట్టడం మొదలెట్టారు. జంపింగ్ ఎమ్మెల్యేలు కూడా బాబు చేతకాని తనాన్ని ఎండగడుతున్నారు. బాబు చేతకానితనం వళ్ళే రాష్ట్రం అథోగతి పాలవుతోందని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఆల్రెడీ జయరాములు, మణిగాంధీ జగన్ అపాయంట్‌మెంట్ కోసం చూస్తున్నారు. అయితే జగన్ మాత్రం పార్టీలోకి వస్తే సీట్ల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ అన్ కండిషనల్‌గా రావాలని కండిషన్స్ పెడుతున్నాడు. జంపింగ్‌ల విషయం ఇలా ఉంటే ఇప్పుడు ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు విజయసాయిరెడ్డికి టచ్‌లోకి వెళ్ళారని తెలుస్తోంది. అయితే జగన్ మాత్రం రాజీనామాలు చేసే ధైర్యం ఉండాలి, టిడిపి ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామాలు చేశాకే పార్టీలో చేరాలి అని కండిషన్స్ పెడుతున్నాడు. ఈ ఒక్క కండిషన్ లేకపోతే ఈ పాటికే వైకాపాలోకి టిడిపి ఎమ్మెల్యేల జంపింగ్స్ ఉండేవని తెలుస్తోంది. అయితే జగన్ మాత్రం అనైతిక పిరాయింపు రాజకీయాలు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అందుకే శిల్పా చక్రపాణిరెడ్డిచేత రాజీనామా చేయించానని కూడా చెప్తున్నాడు. ఏది ఏమైనా జూన్ తర్వాత నుంచీ ఎన్నికల ఏడాది మొదలవ్వనుండడంతో జూన్ నుంచి టిడిపి ఎమ్మెల్యేల జంపింగ్స్ చాలానే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తంగా వైకాపాను ఖాళీ చేయిద్దామనుకున్న బాబు ప్లాన్ రివర్సయి ఇప్పుడు టిడిపికే 2019 ఎన్నికల్లో 2014లో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతి పట్టనుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అంటే ఇదేనేమో మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -