Tuesday, March 19, 2024
- Advertisement -

రాష్ట్రపతి గా వెంకయ్య.. మోడి చూపు ఎటువైపు ?

- Advertisement -

ప్రస్తుతం దేశంలో రాష్ట్రపతి ఎన్నికల హీట్ మామూలుగా లేదు. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ పదవి కాలం జూలై 24 తో పూర్తికానుంది. దాంతో జూలై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల కోసం దేశమంత కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జూలై 21న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇక అధికార బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి గా తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నలే చేస్తోంది. అదే సమయంలో విపక్షాలు సైతం తమ అభ్యర్థులను రేసులో నిలబెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. దేశంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీయే బలపరిచిన అభ్యర్థి యొక్క విజయం నల్లేరు మీద నడకే అనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది.

అయితే ఎన్డీయే కూటమి ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్డీయే అభ్యర్థిగా ఉప ముఖ్యమంత్రి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సాధారణంగా ఎన్డీయే తరుపున ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారు రాష్ట్రపతి గా వెళ్లడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ అభ్యర్థి ఎంపిక అనేది ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో ఉంటుంది. మరి మోడీ రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య ను ఎన్నుకుంటారా ? లేదా ? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దక్షిణాది రాష్ట్రాల నేతలకు అవకాశం కల్పించే దిశగా బీజేపీ నిర్ణయం తీసుకుంటే వివాదరహితుడుగా పేరున్న వెంకయ్య నాయుడు పేరు ముందు వరుసలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ వెంకయ్య నాయుడి పేరు రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే విపక్షాలు సైతం వెంకయ్యకు ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

దాంతో రాష్ట్రపతి గా వెంకయ్య గెలుపు నెల్లేరు మీద నడకే అవుతుంది. అదే గనుక జరిగితే నీలం సంజీవరెడ్డి తరువాత రాష్ట్రపతి పదవి దక్కించుకున్న మరో తెలుగువాడిగా వెంకయ్య నాయుడి పేరు నిలిచిపోతుంది. ఇక గతంలో ఉపరాష్ట్రపతులుగా ఉన్న డా, సర్వేప్పల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వి.వి. గిరి, ఆర్ వెంకట్రామన్, డా. శంకర్ దయాళ్ శర్మ, కె. ఆర్ నారాయణ్ వంటి వారు రాష్ట్రపతులు అయ్యారు. అదే కోవలో వెంకయ్య నాయుడు కూడా రాష్ట్రపతిగా పడేన్నతి చేపట్టాలని ముఖ్యంగా దక్షిణాది ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి వెంకయ్య రాష్ట్రపతి రేస్ లో నిలవాలంటే, ప్రధాని మోడి ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేయాల్సి ఉంటుంది. మరి మోడి చూపు ఎటు వైపు ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

ఇవి కూడా చదవండి

టి‌ఆర్‌ఎస్ కొత్త అద్యక్షుడు .. కే‌టి‌ఆర్ కదా ?

ఆ రాష్ట్రాలలో .. బిజెపికి షాక్ తప్పదా ?

మద్యపాన నిషేదం.. గాలికి వదిలేసినట్లేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -