టి‌ఆర్‌ఎస్ అద్యక్షుడిపై .. కే‌సి‌ఆర్ దృష్టి ?

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణ ముఖ్య మంత్రి కే‌సి‌ఆర్.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాతీయ స్థాయి పార్టీలు గా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రమే ఉన్నాయి. ఆ రెండు పార్టీలకు బలమైన ప్రత్యర్థిగా ఎదిగేందుకు ఫెడరల్ ఫ్రంట్ తో కే‌సి‌ఆర్ కొన్నేళ్లుగా ముమ్మర ప్రయత్నలే చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆ ప్రయత్నాలకు మరింత పదును పెడుతూ సొంతంగా జాతీయ పార్టీని పెట్టె దిశగా అడుగులు వేస్తున్నారు కే‌సి‌ఆర్. ఇప్పటికే భారత్ రాష్ట్రీయ సమితి పేరును కూడా ఆ పార్టీకి ఖరారు చేసినట్లు గులాబీ దళంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం కూడా ఉంది.

అయితే కే‌సి‌ఆర్ గుండె చప్పుడు అయిన టి‌ఆర్‌ఎస్ పార్టీ విషయంలోనే ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కే‌సి‌ఆర్ జాతీయ పార్టీ పెట్టి ఆ పార్టీని బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తే.. ప్రాంతీయంగా తెలంగాణలో అధికారంలో ఉన్న టి‌ఆర్‌ఎస్ పార్టీ పదవి బాధ్యతలపైనే కాస్త సంధిగ్ధత నెలకొంది. ఎందుకంటే ప్రస్తుతం టి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ గా కే‌టి‌ఆర్ ఉన్నాడు. ఒకవేళ కే‌సి‌ఆర్ జాతీయ పార్టీ చూసుకుంటే, కే‌టి‌ఆర్ టి‌ఆర్‌ఎస్ పార్టీ పగ్గాలు చేపడతాడు అనేది జగమెరిగిన సత్యం. అయితే ఇక్కడ చిక్కేమిటంటే కుటుంబ సభ్యులకు అద్యక్ష పదవి బాద్యతలు ఇవ్వడం వల్ల విపక్షాల నుండి అలాగే ప్రజల నుండి కూడా కొంత విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది.

- Advertisement -

ఎందుకంటే ఇప్పటికే టి‌ఆర్‌ఎస్ పార్టీ లో ఎక్కువమంది కే‌సి‌ఆర్ కుటుంబ సభ్యులే ఉండడంతో కే‌సి‌ఆర్ వారసత్వ రాజకీయాలు చేస్తున్నాడనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అద్యక్ష పదవి కే‌టి‌ఆర్ కు అప్పగించడం వల్ల విమర్శలు మరింత పెరిగి టి‌ఆర్‌ఎస్ పార్టీ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల టి‌ఆర్‌ఎస్ అద్యక్ష పదవి బాధ్యతలు పార్టీలోని ముఖ్య నేతలలో ఎవరో ఒకరికి కట్టబెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా వేముల ప్రశాంత్ రెడ్డి పేరు అధికంగా వినిపిస్తోంది. మరి కే‌సి‌ఆర్ టి‌ఆర్‌ఎస్ పదవి బాద్యతల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

ఇవి కూడా చదవండి

అప్పుల ఊబిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు !

మద్యపాన నిషేదం.. ఇక లేనట్లే !

ఎన్టీఆర్ జపం చేస్తోన్న..చంద్రబాబు ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -