Saturday, May 25, 2024
- Advertisement -

ఉత్త‌రాంధ్రాపై విజ‌య్‌సాయి ప్ర‌త్యేక దృష్టి….

- Advertisement -

2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాలాని ప్ర‌య‌త్నాలు చేస్తున్న వైసీపీ …బ‌ల‌హీనంగా ఉన్న ఉత్త‌రాంధ్రాలో స‌త్తాచాటాల‌ని ప‌క్కాప్ర‌ణాలిక‌లు ర‌చిస్తున్నారు. అక్క‌డ ఎక్కువ సీట్లు గెల‌వాలంటే విశాఖ పార్ల‌మెంట్ స్థానాన్ని ఖ‌శ్చితంగా గెల‌వాల్సిందే. అందుకే జ‌గ‌న్ ఆ బాధ్య‌త‌ను విజ‌య‌సాయిరెడ్డికి అప్ప‌గించారంట‌.

విజయసాయి కూడా రాజ్యసభకు ఎన్నికైన తర్వాత విశాఖపట్నం జిల్లాను దత్తత తీసుకున్నారు. వైజాగ్ పార్లమెంటు స్ధానంపై అంత ప్రత్యేకంగా దృష్టి పెట్టటం ఎందుకంటే, వైఎస్ కుటుంబం కోసమే అని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ కుటుంబం నుండి విజయమ్మ లేదా షర్మిల ఎవరైనా పోటీ చేయవచ్చని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

2014 ఎన్నిక‌ల్లో విజయమ్మ బిజెపి అభ్యర్ధి కంభంపాటి హరిబాబు చేతిలో సుమారు లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్ర‌ధానంగా లివెందుల రౌడీలు, గుండాలు వైజాగ్ వాతావరణాన్ని నాశనం చేసేస్తారని పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారంతో విజయమ్మ ఓడిపోయారు. ఈసారి అలాంటి పొర‌పాటు జ‌ర‌గ‌కుండా విజ‌య‌సాయి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.

విజ‌య‌మ్మ ఒక సారి పోటీ చేశారు కాబ‌ట్టి ఇప్పుడు శ‌ర్మిల‌ను బ‌రిలోకి దింపేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. షర్మిలైతే జనాల్లోకి చొచ్చుకుపోగలరు. గతంలో చేసిన పాదయాత్ర, రాజకీయ ప్రసంగాలు ఉపయోగపడతాయి. విజయమ్మతో పోల్చుకుంటే క్యాడర్ కూడా షర్మిలను బాగా రిసీవ్ చేసుకుంటార‌నేది పార్టీ వ‌ర్గా భావ‌న‌.

లోక్ సభ పరిధిలోని విశాఖ నగరంలోని ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్ నియోజకవర్గాలతో పాటు పెందుర్తి, గాజువాక, భీమిలి నియోజకవర్గాల్లోనే ఎక్కువగా క్యాంప్ వేస్తున్నారు విజ‌య‌సాయిరెడ్డి. అదే సమయంలో బిజెపి, టిడిపిలపై జనాల్లో పెరుగుతున్న వ్యతిరేకత కూడా వైసిపికి కలిసి వచ్చే అవకాశముంది. అయితే ఎవ‌రు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా ఫైన‌ల్ చేయాల్సింది జ‌గ‌నే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -