Thursday, May 2, 2024
- Advertisement -

ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు..

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం పాద‌యాత్ర విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కొన‌సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని త‌న శ‌క్తి సామ‌ర్థ్యాలు ఒడ్డుతున్నారు జ‌గ‌న్‌. సంత్స‌రం కాలంగా జ‌నంలో ఉంటూ వారి స‌మ‌స్య‌ల‌ను సాద‌వానంగా వింటూ ..అధికారంలోకి రాగానే వాటిని ప‌రిస్క‌రిస్తామ‌ని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

జ‌గ‌న్ మొద‌లు పెట్టిన పాద‌యాత్ర ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. గ‌తంలో కూడా దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాద‌యాత్ర చేసిన‌ప్పుడు కూడా ఇచ్ఛాపురంలోనే పాద‌యాత్ర ముగిసింది. తండ్రి సెంటీ మెంట్‌నే జ‌డ‌న్ ఫాలో అవుతున్నారు.

ఇప్పటికే జగన్ పాదయాత్ర ప్రారంభం అయ్యి సంవత్సరం గడిచిపోయింది. కోర్టుకు హాజరైన రోజులు, హత్యాయత్నం నేపథ్యంలో మినహాయిస్తే పండగ రోజులు తప్ప మిగతా అన్నిరోజులూ జగన్ మోహన్ రెడ్డి జ‌నంలోనే ఉన్నారు. పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు కూడ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

పాద‌యాత్ర ముగింపుకు ఇంకాస్త స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఎందుకంటే జ‌గ‌న్‌పై దాడి జ‌ర‌గ‌క‌పోయింటే త్వ‌ర‌గా పాద‌యాత్ర ముగిసేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనాల ప్రకారం జగన్ పాదయాత్ర వచ్చే ఏడాది జ‌న‌వ‌రి వ‌ర‌కూ వరకూ సాగవచ్చు. సంక్రాంతి సమయానికి జగన్ పాదయాత్ర ఇచ్చాపురానికి చేరే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. పాద‌యాత్ర ముగిసిన వెంట‌నే జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు. పాద‌యాత్ర‌లో ట‌చ్ చేయ‌ని నియోజ‌క వ‌ర్గాల‌ను బ‌స్సు యాత్ర ద్వారా ప‌ర్య‌టించ‌నున్నారు.

జ‌గ‌న్ పాద‌యాత్ర  జ‌న‌వ‌రి చివ‌రివారంలో ముగిసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అదే సమయంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తోంది.ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ఉటుంద‌ని ఈసీ తెలిపిన సంగ‌తి తెలిసిందే. బ‌స్సు యాత్ర చేస్తూనే అభ్య‌ర్తుల‌ను జ‌గ‌న్ ప్ర‌క‌టిస్తార‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. పాద‌యాత్ర పూర్త‌య్యే స‌మ‌యానికి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కూడా వ‌స్తుంది కాబ‌ట్టి ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లన్న‌మాట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -