Thursday, May 2, 2024
- Advertisement -

లోకేశ్ పాదయాత్ర.. జగన్ తో పోలికా ?

- Advertisement -

ప్రస్తుతం ఏపీ లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఘోర ఓటమితో ఆ పార్టీ మరింత బలహీన పడింది. దాంతో టీడీపీకి పునర్వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు విశ్వ ప్రయత్నలే చేస్తున్నారు. అయితే టీడీపీ బలం బలహీనత రెండు కూడా చంద్రబాబుపైనే ఆధారపడడంతో బాబు తరువాత ప్రత్యమ్న్యాయ నాయకత్వపు లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైతే చంద్రబాబు వయసు డెబ్బై దాటడంతో వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ ఓడిపోతే.. చంద్రబాబు రాజకీయాలకు విరామం ప్రకటించిన ఆశ్చర్యం లేదు.. దాంతో టీడీపీకి చంద్రబాబు తరువాత బలమైన నాయకుడు ఎవరనేది ప్రశ్నార్థకమే..

ఈ నేపథ్యంలో తనయుడు లోకేశ్ ను టీడీపీ ప్రత్యమ్న్యాయ నాయకుడిగా నిలబెట్టేందుకు బాబు విశ్వ ప్రయత్నలే చేస్తున్నారు. కానీ లోకేశ్ ను టీడీపీ తదుపరి నాయకుడిగా గుర్తించేందుకు తెలుగు తమ్ముళ్ళు కూడా పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే లోకేశ్ బహిరంగ సభలలో తడబడుతుండడం, ప్రజలను ఆకర్షించుకోవడంలో విఫలం అవుతుండడంతో లోకేశ్ టీడీపీని చంద్రబాబు స్థాయిలో నిలబెడతారా ? అన్న సందేహాలు బలంగానే వ్యక్తమౌతున్నాయి. అంతే కాకుండా లోకేశ్ ను పప్పు అని, అసమర్థుడని వైసీపీ వర్గం గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సస్ అయ్యారు.

దీంతో లోకేశ్ అసమర్థుడని ప్రజల్లో ఉన్న భావనను చెరిపి వేసి.. బలమైన నేతగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునేందుకు లోకేష్ గట్టిగానే కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆదిశగా లోకేష్ కొంతవరకు సక్సస్ అయ్యాడు కూడా. గతంతో పోలితే లోకేష్ లో చాలావరకు మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మాటల్లోనూ, ప్రత్యర్థి పార్టీ నుంచి ఎదురవుతున్న విమర్శలను తిప్పికొట్టడంలోను చురుకుదనం చూపిస్తున్నారు. దీంతో లోకేష్ మెల్లమెల్లగా తన పరిధిని పెంచుకుంటున్నారనేది.. టిడిపి వర్గంలో వినిపిస్తున్న మాట. ఇక ఇదే జోష్ లో లోకేష్ పాదయాత్ర చేపట్టేందుకు కూడా సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి లోకేష్ పాదయాత్ర చేపడతాడని సమాచారం. ఈ పాదయాత్ర వల్ల లోకేష్ కు కొంతమేర లాభం చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండడం వల్ల వారి అభిప్రాయాలను తెలుసుకొని.. ప్రజలకు అనుగుణంగా తనను తాను మార్చుకునే అవకాశం ఉంటుంది.

Also Read :

శాశ్వతంగా ఉండాలంటే.. కుదరదు జగన్ సార్ ?

పాపం.. జూ. ఎన్టీఆర్ !

మోడీపై అంత నమ్మకమెందుకు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -