Thursday, May 9, 2024
- Advertisement -

నవరత్నాలు కాదు నవ’అస్త్రాలు’

- Advertisement -

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోటి వెంట గత ఎనిమిది నెలలుగా వినిపిస్తున్నమాట ‘నవరత్నాలు’. 2019 ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే, అధికారం చేపట్టాక తాను చేపట్టబోయే పథకాల గురించి ఆయన చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ‘నవరత్నాలు’, పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని హామీ ఇస్తున్నారు. అందుకే పాదయాత్రలో ఊరూవాడా దద్ధరిల్లేలా, ప్రతిపక్షాల గుండెలదిరేలా, ఓటర్ల మనసులకు నేరుగా తాకేలా, జగన్ పదే పదే నవరత్నాలు గురించి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ మాదిరిగా లెక్కలేనన్ని హామీలతో మ్యానిఫెస్టోని నింపేసి ఓ పుస్తకం ప్రింట్ చేయబోమని జగన్ ఎద్దేవా చేస్తున్నారు. పాదయాత్రలో ప్రజల సాదకబాధలు తెలుసుకుని, వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ పార్టీ మ్యానిఫెస్టోను రూపొందిస్తామని చెబుతున్నారు. కేవలం రెండే రెండు పేజీల్లో తమ మ్యానిఫెస్టో ఉంటుందని, ఆ రెండు పేజీల్లోనే నవరత్నాల గురించి వివరిస్తామని జగన్ ప్రచారం చేస్తున్నారు.

నవరత్నాలు
1 వైఎస్ఆర్ సీపీ రైతు భరోసా
2 ఫీజు రీయింబర్స్ మెంట్
3 ఆరోగ్యశ్రీ
4 జలయజ్ఞం
5 మద్యపాన నిషేధం
6 అమ్మ ఒడి
7 వైఎస్ఆర్ ఆసరా
8 అర్హులందరికీ ఇల్లు
9 పెన్షన్ల పెంపు

ఇవీ జగన్ చెబుతున్న సంక్షేమ పథకాలు. ఈ 9 పథకాల్లోనే మహిళలు, వికలాంగులు, వితంతువులు, రైతులు, వృద్ధులు, విద్యార్ధులు, ఉద్యోగులు ఇలా అన్నివర్గాల వారికి లబ్ది చేకూరేలా ఆయన ప్లాన్ చేస్తున్నారు. పాదయాత్రలో 60 ఏళ్ల పైబడిన తాత, అవ్వ వచ్చినా జగన్ చాలా ఓపికగా ఈ నవరత్నాల గురించి స్వయంగా వారి చెవిలో చెబుతున్నారు. ఇప్పటికే వీటికి గురించి జనంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. వాటి సాధ్యాసాధ్యాలకు బడ్జెట్ సరిపోతుందా ? లేదా ? అనే అంశాన్ని పక్కన పెడితే… జనంలో ఆ ఆశ అయితే మొదలైంది. చేయగలరో లేదో తర్వాత చూద్దాం. ప్రస్తుత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చలేదు కదా. దేశంలో ఏ పార్టీకి అది సాధ్యం కూడా కాదు కదా. జగన్ కు కూడా ఓ సారి అవకాశమిద్దాం అనే పోజిటివ్ వైబ్రేషన్స్ ఆల్రెడీ మొదలయ్యాయి. పాదయాత్రకు అశేషంగా తరలివస్తున్న జనప్రభంజనాన్ని చూస్తూ జగన్ కూడా రెట్టించిన ఉత్సాహంతో, చాలా ఓపికగా ప్రతి ఒక్కరికీ నవరత్నాల పథకాల గురించి చేరేలా ప్రసంగిస్తున్నారు. ఒక రకంగా ఆయన వీటిపై జనంలో చర్చ జరిగేలా, జగన్ అధికారంలోకి వస్తే వీటి ద్వారా తమకు మేలు కలుగుతుందేనే నమ్మకాన్ని కలిగించడంలో విజయం సాధించారు. కానీ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులు, నియోజకవర్గాల ఇంచార్జులు, కో ఆర్డినేటర్లు మాత్రం నవరత్నాల గురించి పూర్తి స్థాయి ప్రచారం కల్పించలేకపోతున్నారు. వాళ్లు కూడా పూర్తిగా వీటి ప్రచారంపైనే ఫోకస్ పెట్టి ప్రచారం చేస్తే వచ్చే ఎన్నికల్లే టీడీపీ ‘ఫసక్’. అందుకే వీటిని ‘నవరత్నాలు’ కాదు ‘నవఅస్త్రాలు’ అని కొనియాడింది. ప్రతిపక్షాలను హెచ్చరించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -