Wednesday, May 8, 2024
- Advertisement -

వైవీ సుబ్బారెడ్డి కొంప ముంచుతున్నాడా?

- Advertisement -

ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రతో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. జగన్ పాదయాత్రకు పాజిటివ్ రిపోర్టు వస్తోంది. ప్రజాసంకల్పయాత్రతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని, నిలదొక్కుకుందని.. వచ్చే ఎన్నికలతో అధికారం దిశగా పయనిస్తోందని పరిశీలకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. పాదయాత్ర పుణ్యమా అని జగన్ ముఖ్యమంత్రి కావడం ఖరారు అనే అంచనాలు వేస్తున్నారు. అయితే జగన్ కష్టం కూడా అలాగిలాగా లేదు. తీవ్రమైన కష్టమే పడుతున్నాడు. కాళ్లకు బొబ్బలొచ్చినా జగన్ తన పాదయాత్రను ఎక్కడా ఆపకుండా కొనసాగిస్తూ ఉన్నారు.

జగన్ కష్టం అలా ఉంటే.. జగన్ పేరుతో పార్టీలో పైరవీలు చేసే నేతలు మాత్రం తమ తీరున తాము సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో వీళ్లు తల దూర్చుతూ రచ్చ చేస్తూ ఉన్నారని సమాచారం. ఈ విషయంలో జగన్ బంధువులే ముందున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి జగన్ కు బాబాయ్ వరస అయ్యే వైవీ సుబ్బారెడ్డి పేరు ఇలాంటి రచ్చ విషయంలో వినిపిస్తూ ఉండటం విశేషం. ఈ విషయంలో జగన్ కూడా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఇటీవల వైవీ సుబ్బారెడ్డికి జగన్ క్లాస్ పీకడం కూడా జరిగిందని సమాచారం.

ప్రకాశం జిల్లాతో పాటు, మరి కొన్ని జిల్లా వ్యవహారాల్లో వైవీ సుబ్బారెడ్డి వేలు పెడుతూ.. తనకు నచ్చిన వారికి పార్టీ టికెట్లు కట్టబెట్టే పనిలో ఉన్నాడట వైవీ. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలో ఇన్ చార్జి మార్పు విషయంలో పాదయాత్రలో ఉన్న జగన్ మోహన్ రెడ్డితో వైవీ సుబ్బారెడ్డి సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. తనకు నచ్చిన వారికి అనుకూలంగా రిపోర్టులు ఇస్తూ, తనకు నచ్చని వారికి నెగిటివ్ రిపోర్టులు ఇస్తున్నారట వైవీ. ఈ వ్యవహారంపై జగన్ కు కూడా ఆగ్రహం వచ్చిందని వైసీపీలో ప్రచారం జరుగుతోంది.

కేవలం ప్రకాశం జిల్లా వ్యవహారాలపైనే కాకుండా ఈస్ట్, వెస్ట్ జిల్లాల వ్యవహారాల్లో కూడా వైవీ సుబ్బారెడ్డి జోక్యం ఉందని సమాచారం. గత ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో వచ్చిన తేడాలే ఆ జిల్లాల్లో వైసీపీని బాగా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో జగన్ ఈ సారి మరింత జాగ్రత్తగా వెళ్లాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి సమయంలో వైవీ వంటి వారి జోక్యం వల్ల మళ్లీ పాత కథ రిపీట్ అవుతోందనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో వైవీకి జగన్ గట్టిగా క్లాస్ పీకారని, దీంతో ఇక అభ్యర్థుల ఎంపికలో తను జోక్యం చేసుకోను అని వైవీ జగన్ కు చెప్పినట్టుగా వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ మోహన్ రెడ్డి చాలా వ్యవహారాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగవలసిన అవసరం కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -