Friday, May 3, 2024
- Advertisement -

ఒక వైపు పాద‌యాత్ర‌కు స‌న్నాహాలు… మ‌రో వైపు జంపింగ్ జిలానీలు

- Advertisement -

వైసీపీ అధినేత ప్ర‌స్తుతం క్లిష్ట ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్ప‌టికె ఆ పార్టీకి షాక్ ల‌మీద షాక్ లు త‌గులుతున్నాయి. టీడీపీ ప్రారంభించ‌న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో పార్టీలో ఎవ‌రు ఉంటారో ఎవ‌రు వెల్తారో తెలియ‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఒక వైపు పాద‌యాత్ర‌…మ‌రో వైపు జంపింగ్‌నేత‌ల‌తో జ‌గ‌న్ దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో ఉన్నారు. తాజాగా జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను ప్రారంభించే లోపు బిగ్‌షాక్ త‌గ‌ల‌నుంద‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.

విప‌క్ష వైసీపీ అధినేత వ‌చ్చే నెల 2వ తేదీ నుంచి పాద‌యాత్ర‌కు రెడీ అవుతోన్న వేళ వ‌రుస షాకులు త‌గులుతున్నాయి.జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అంతా రెడీ చేసుకుంటోన్న వేళ ఓ వైపు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌తో చాలా మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేస్తార‌ని వార్తలు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికె జ‌య‌న‌గ‌రం వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త కోల‌గట్ల వీర‌భ‌ద్ర‌స్వామి త‌న‌ను స‌మ‌న్వ‌య‌క‌ర్త ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నని, త‌న బ‌దులు నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు ఇత‌రుల‌కు అప్ప‌గించాల‌ని కోల‌గ‌ట్ల జ‌గ‌న్‌కు లేఖ రాశారు.

ఇక వారం రోజుల క్రితం ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకూడదని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఏకంగా జగన్‌కే తెలియజేశారు. ఈ రెండు పరిణామాలు వైసీపీ నేత‌ల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి.

క‌ర్నూలు జిల్లాకు చెందిన ఎంపీ,ఎమ్మెల్యేల‌తో జ‌గ‌న్ భేటి అయ్యారు. భేటీలో జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చార‌ని తెలుస్తోంది. నియేజ‌క వ‌ర్గాల్లో కార్య‌క‌ర్త‌ల అభీష్టంమేర‌కె న‌డుచుకుంటామ‌ని చెప్ప‌డంతో జ‌గ‌న్ ఖంగుతిన్నారు. వీరు ఎప్పుడైనా సైకిల్ ఎక్క‌డానికి సిద్ధంగా ఉన్నారు.

జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభ‌మ‌య్యే టైంకు పార్టీలో ఇంకెంత‌మంది ఇలా షాకులిస్తారో ? అన్న‌ది ఒక చ‌ర్చ అయితే ఇంకెంత మంది ఎమ్మెల్యేలు పార్టీ కండువా మార్చేస్తార‌న్న‌దానిపై కూడా పెద్ద ఎత్తున ఇన్న‌ర్‌గా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. పాద‌యాత్ర మొద‌ల‌య్యేనాటికి పార్టీని బ‌ల‌హీనం చేయాల‌ని బాబు వేస్తున్న ఎత్తుల‌ను జ‌గ‌న్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -