Monday, May 6, 2024
- Advertisement -

గౌతంరెడ్డి వివాదానికి తెర‌దించిన వైసీపీ

- Advertisement -

విజయవాడకు చెందిన గౌతమ్ రెడ్డి వివాదానికి ఎట్టకేలకు వైసీపీ నాయకత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. వంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ను కొన్ని నెలల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జగన్. అయితే కొద్దిరోజుల క్రితం పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌ను క‌వ‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

జగన్‌ను కలిశానని… వచ్చే ఎన్నికల్లో వంగవీటి రాధాకే టికెట్ ఇస్తామని జగన్‌ చెప్పారని.. అయినా తనకు అభ్యంతరం లేదని చెప్పి వచ్చానని మీడియాతో చెప్పారు గౌతమ్ రెడ్డి. అయితే ఇప్పటికీ ఆయనపై వైసీపీ సస్పెన్షన్ ఎత్తివేయలేదు. . అయితే ఈ మ‌ధ్య‌న ఆయన వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ అభిప్రాయాలుగా టీవీ చర్చల్లో ఉంచుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన వైసీపీ నాయకత్వం ఎట్టకేలకు గౌతమ్ రెడ్డిపై స్పష్టమైన ప్రకటన చేసింది. గౌతమ్ రెడ్డి తమ పార్టీ సభ్యుడు కాదంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఒకప్రకటన విడుదల చేశారు.

గౌతమ్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని ప్రకటనలో మరోసారి గుర్తు చేశారు. గౌతమ్ రెడ్డి తనకు తాను వైసీపీ నాయకుడిగా చెప్పుకుంటూ టీవీ చర్చల్లో పాల్గొంటున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. కానీ గౌతమ్ రెడ్డి తమ పార్టీ సభ్యుడు కాదని.. ఆయన అభిప్రాయాలకు, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గౌతమ్ రెడ్డిని ఇకపై వైసీపీ సభ్యుడిగా చర్చా కార్యక్రమాల్లో గుర్తించవద్దని మీడియా సంస్థలకు ప్రకటనలో విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -