Tuesday, May 7, 2024
- Advertisement -

చెయ్యలేదని ఎద్దేవా చేశారుగా…. చేస్తాం అనేసరికి చెత్త మాటలేల?

- Advertisement -

పచ్చ బ్యాచ్ సిద్ధాంతాలన్నీ ఇలానే ఉంటాయి. తెలంగాణా ఇస్తారా? ఇవ్వరా? మా భుజంపై నుంచి గన్ పెట్టి కాలుస్తాం అంటే ఒప్పుకోం. దమ్ముంటే తెలంగాణా ఇవ్వండి. మమ్మల్ని సాకుగా చూపొద్దు…అంటూ సోనియాగాంధీపై చంద్రబాబు రంకెలేశాడు. రాష్ట్ర విభజనకు మద్ధతుగా లేఖలు రాశాడు. టిడిపి నాయకుల చేత హంగామా చేశాడు. ఇస్తారా? ఇవ్వరా? అని సోనియాను ఛాలెంజ్ చేశాడు. కట్ చేస్తా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తాం అని సోనియా చెప్పింది. ఆ దెబ్బకు దిమ్మతిరిగిన చంద్రబాబు సీమాంధ్రలో ఓట్లు పోతాయన్న ఉద్ధేశ్యంతో వెంటనే ఇంకో డ్రామా మొదలెట్టాడు. సమైక్యాంధ్ర అనే దమ్ములేక రెండు నాలుకల సిద్ధాంతం, మడత బేరాల మాటలు మాట్లాడాడు. రాష్ట్ర విభజన సమయంలో స్థిరంగా ఒక్క అభిప్రాయం కూడా చెప్పలేక చేతకాని, చేవలేని రాజకీయం చేసి ఆంధ్రప్రదేశ్‌ని నిండా ముంచిన ఘనుడు చంద్రబాబు.

ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబువి అవే డ్రామాలు. మోడీ ఇస్తాడా? ఇవ్వడా? అనే విషయం పక్కన పెడితే అత్యుత్సాహంతో మోడీకంటే ముందుగానే ప్రత్యేక హోదాను తుంగలో తొక్కింది చంద్రబాబు అన్నది నిజం. మోడీ దగ్గర ఏ వ్యక్తిగత స్వార్థం కోసం బాబు లాలూచీ పడ్డాడో కానీ ఆంధ్రప్రదేశ్‌ని అథోగతి పాలు చేసేలా హోదాకు తానే మంగళం పాడేశాడు. ఆ తర్వాత ప్యాకేజ్‌లో ఏమున్నాయో కూడా చూడకముందే ప్యాకేజ్ బ్రహ్మాండం…..మోడీ అద్భుతంగా సాయం చేస్తున్నాడు అని చెప్పాడు.

అయితే జగన్ మాత్రం చంద్రబాబు చెప్పిన రుణమాఫీలు అస్సలు సాధ్యం కాదు అని 2014 ఎన్నికల సమయంలో జనాలకు నిజాలు చెప్పినట్టుగానే ప్యాకేజ్ వేస్ట్……హోదానే బెస్ట్ అని మొదటి నుంచీ చెప్తూనే ఉన్నాడు. హోదా కోసం రాజీనామాలు చేసి అయినా పోరాడతాం అని చెప్పాడు. అయితే రాజీనామాలు ఎప్పుడు చేయాలి అనే విషయంలో వైకాపాలో చిన్నపాటి సందిగ్థత ఏర్పడింది. దాన్ని అవకాశంగా తీసుకున్న చంద్రబాబు అండ్ బ్యాచ్ రాజీనామాలు ఎప్పుడు చేస్తారు? చేవలేక పారిపోయారా? ఇదేనా మీ చిత్తశుద్ధి? అంటూ నిన్నా మొన్నటి వరకూ కూడా ఆడిపోసుకున్నారు.

ఏప్రిల్ ఆరో తేదీ రాజీనామాలు చేస్తామని విస్పష్టంగా చెప్పిన జగన్……. ప్రత్యేక హోదా కోసం తన పోరాట పంథాను ప్రకటించాడు. దెబ్బకు బాబు అండ్ కోకు దిమ్మతిరిగింది. రాజీనామాలు చేయమని డిమాండ్ చేస్తూ వచ్చిన బాబు అండ్ కో నిజానికి జగన్ నిర్ణయాన్ని ప్రశంసించాలి. అలా చేస్తే ఆయన చంద్రబాబు ఎందుకవుతాడు? అందుకే రాజీనామా చేయడానికి రెడీ అని జగన్ చెప్పిన వెంటనే బాబు అండ్ బ్యాచ్ మొత్తం రాజీనామాలతో ఉపయోగం ఏంటి అని కొత్త పాట మొదలెట్టారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని రాగాలు తీస్తున్నారు. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలోనే హోదా గురించి ఓ మాట చెప్పాడు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అర్హత ఉందని, రాష్ట్ర ప్రభుత్వం తరపున అభ్యర్థన వస్తే పరిశీలిస్తామని చెప్పాడు. చంద్రబాబు పక్కన కూర్చుని మరీ మీడియా మీట్‌లో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు చెప్పిన మాటలు బాబుకు వినపడలేదా?

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు……. అడ్డుకుంటున్నాడు అని జగన్‌పై నిందలేసి తన చేతకానితనాన్ని జగన్‌పైకి నెట్టేయాలని ప్రయత్నించే చంద్రబాబు…..ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవని(ఈ మాట బాబుదే)లాంటి ప్రత్యేక హోదా కోసం ఎంపిల చేత రాజీనామాలు చేయించి, ఢిల్లీ వేదికగాను, రాష్ట్ర స్థాయిలోనూ జగన్ పోరాటం చేస్తానంటుంటే మద్దతివ్వకపోగా ఎందుకు ఉద్యమాన్ని అణచివేస్తున్నట్టు? ఇక్కడే తెలియడంలేదా? ఎవరివి స్వార్థ ప్రయోజనాలో? రాష్ట్ర అభివృద్ధికి శాపంగా మారుతున్నది ఎవరో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -