Monday, April 29, 2024
- Advertisement -

బాబు, పవన్, శివాజీ, రాధాకృష్ణల నిజస్వరూపం ఇది….ఇక నిర్ణయం ప్రజలదే

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసమే రోజుకు 22గంటలు కష్టపడుతున్నానని చంద్రబాబు చెప్తారు. ఆ ప్రజల కోసమే కోట్లాది రూపాయలు వదిలుకుని రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్తారు. ఇక శివాజీది కూడా సేం డైలాగ్. రాధాకృష్ణ కూడా నిజాయితీతో కూడిన జర్నలిజం, ప్రజల కోసం జర్నలిజం చేస్తున్నాను. ప్రాణాలైనా వదులుతాను అనేలా డైలాగులు కొడతాడు. ఐదేళ్ళ పాలన తర్వాత విపక్షాలు అన్నీ కలిసి పోటీ చేసినప్పటికీ ఒంటి చేత్తో మళ్ళీ ప్రజల అభిమానం పొందిన వైఎస్‌ని అతి పెద్ద విలన్‌గా చూపిస్తూ, వైఎస్ జగన్‌ని అంతకంటే పెద్ద విలన్ అని చెప్తూ ప్రజల కోసం పాటు పడుతున్నాం అని చెప్పుకుంటూ మేం హీరోలం అని ప్రజలను నమ్మించాలని చూస్తారు. మరి నిజంగా వీళ్ళు అంతగొప్పవాళ్ళేనా?

2014 ఎన్నికల్లో మోడీని ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన రుద్దింది ఎవరు? మోడీ దేవుడు అని చెప్పింది ఎవరు? అప్పుడు బాబుకు సాయం ఉన్నాడు కాబట్టి మోడీ ఏం చేసినా దేవుడే అని అంటారు. అదే మోడీ ఇప్పుడు బాబు అన్యాయాలు, అక్రమాలు, నీచ రాజకీయాల గురించి ప్రశ్నిస్తున్నాడు కాబట్టి నీచుడు, రాక్షసుడు. ఎన్టీఆర్ విషయంలో కూడా చంద్రబాబు అండ్ బ్యాచ్ ఫాలో అయిన నీతి ఇదే. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిన తర్వాత ఎన్టీఆర్‌కి విలువలు లేవు, క్యారెక్టర్ లేదు, స్త్రీలోలుడు అని ప్రచారం చేసింది ఇదే చంద్రబ్యాచ్. ఆయన చనిపోయాక ఆయన అభిమానుల ఓట్ల కోసం ఎన్టీఆర్‌కి మొక్కితే ఆ వెంకటేశ్వరుడికి మొక్కినట్టే అని ప్రచారం చేసింది, చేస్తున్నది కూడా ఇదే చంద్రబ్యాచ్.

ఇప్పుడు మోడీ విషయానికొద్దాం. ఆంధ్రప్రదేశ్‌కి మోడీ అన్యాయం చేశాడు అన్నది నిజం. జగన్ కూడా ఇదే విషయాన్ని తాజాగా జాతీయస్థాయిలో కూడా విస్పష్టంగా చెప్పాడు. అలాగే ఆ అన్యాయాన్ని చంద్రబాబు దగ్గరుండీ చేయించాడు అన్నది కూడా నిజం. నాలుగున్నరేళ్ళుగా ఎంత అన్యాయం చేసినా, చేస్తున్నా మోడీని పల్లెత్తు మాట అనలేదు చంద్రబాబు. పైగా విమర్శిస్తున్న జగన్‌ని తీవ్రస్థాయిలో అవమానించాడు. ఏమీ తెలియదని ఎద్దేవా చేశాడు.

ఇప్పుడు ఎన్నికల ఏడాదిలో మోడీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న వ్యతిరేకత గమనించి కలిసిపోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని అర్థం చేసుకుని మోడీని విమర్శించడం……….కరెక్ట్‌గా చెప్పాలంటే మినిమం సంస్కారం లేకుండా తిట్టడం స్టార్ట్ చేశాడు. మోడీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అన్ని విషయాల్లోనూ మోడీని పొగిడింది ఇదే చంద్రబాబు. ఇప్పుడు మోడీని తిడితే ఓట్లు వస్తాయని భావిస్తూ అదే మోడీని అందరికంటే ఎక్కువగా తిడుతున్నది బాబు అండ్ బ్యాచ్.

అది ఏ స్థాయిలో అంటే టెర్రరిస్టుల ఎటాక్ వెనకాల మోడీ ఉన్నాడు అని అర్థం వచ్చేలా దేశ ప్రయోజనాలను తాకట్టుపెట్టేంత. చంద్రబాబు, పవన్‌ల మాటలు పాకిస్తాన్ నాయకులు, టెర్రరిస్టులు సమర్థించుకోవడానికి ఉపయోగపడ్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు రాధాకృష్ణ కూడా పూర్తిగా పవన్ మాటలను సమర్థిస్తూ అనుకుంటున్నారు, అట అంటూ వీకెండ్ కామెంట్ రాసేశాడు. ఇమ్రాన్ ఖాన్‌ని శాంతికాముకుడిని చేశాడు. ఇండియాలో కూడా ఇమ్రాన్ ఖాన్‌కి ఫ్యాన్స్ పెరిగారని రాసుకొచ్చాడు.
వీళ్ళందరికీ అసలు ఇంగితం ఉంటుందా? ఎవరి దౌత్యం ఫలించి అమెరికాతో సహా ఇతర దేశాలన్నీ పాకిస్తాన్‌ని హెచ్చరించాయి? ఎవరికి భయపడి ఇమ్రాన్ ఖాన్ మన సైనికుడిని వదిలేశాడు? అనే విషయాలు అందరికీ తెలుసు. అయినప్పటికీ చంద్రబాబుకు సాయపడని మోడీ భారతదేశానికి మంచి చేసినా సరే రాక్షసుడే. చంద్రబాబు అధికారంలోకి రావడానికి సాయపడితే రాష్ట్రాన్ని విభజించిన సోనియా కూడా దేవత అయిపోతుంది. అదీ చంద్రబ్యాచ్ నీతి. అధికార కక్కుర్తి, అధికారం కోసం రాజకీయం, కుల రాజకీయం, పరిటాల రవిని చంపాడని నానా యాగీ చేసి తిరిగి అదే నాయకుడిని పార్టీలో చేర్చుకోవడం……..సొంత మామనే వెన్నుపోటు పొడవడం……….అధికారం కోసం ఏమైనా చేస్తారు.

దేశప్రయోజనాలు అవసరం లేదు……తెలుగు ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు……..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు. చంద్రబాబు అధికారానికి, ఆ అధికారంలో భాగమై చంద్రబ్యాచ్ అంతా దోచుకోవడానికి సాయం చేస్తూ ఉంటే ఆ నాయకుడు మంచోడు. అలాంటివాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచినా మంచోళ్ళే. అదే పచ్చ బ్యాచ్ అధికారంలోకి రావడానికి అడ్డుపడినా, పచ్చ బ్యాచ్ అక్రమాలు ప్రశ్నించినా అలాంటి వాళ్ళు రాక్షసులు. తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి మంచి చేసినా సరే……బాబోరికి వ్యతిరేకం కాబట్టి రాక్షసులే. ఎన్టీఆర్, కేసీఆర్, నరేంద్రమోడీ, వైఎస్సార్, జగన్, పవన్……….ఎవ్వరైనా సరే………చంద్రబ్యాచ్ సిద్ధాంతం ఇదే. ఇక చంద్రబ్యాచ్ తప్పులను ఎత్తిచూపిన వాళ్ళందరినీ దేశద్రోహులుగా, తెలుగు ద్రోహులుగా చిత్రీకరిస్తూ రాత్రింబవళ్ళూ వీళ్ళాడే నాటకాలు, చెప్పే అడ్డగోలు మాటలు, తిట్టే తిట్లు అన్నీ కూడా మనుషులుగా వాళ్ళ స్థాయి ఏంటో జనాలకు అర్థమయ్యేలా చేస్తాయి. ఈ విషయాలన్నీ ఇప్పుడు దేశ ప్రజలతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. అధికారం కోసం ఎంతకైనా దిగజారే, ఏ స్థాయి నీచ రాజకీయాలు చేయడానికి అయినా సిద్ధపడేవాళ్ళను ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి ఆదరిస్తారా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -