మొబైల్ ఎక్కడైనా మర్చిపోతే ఇలా చేయండి..!

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతిఒక్కరికి తప్పనిసరి అయింది. పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతిఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు. బ్యాంక్ లావాదేవీలు మొదలుకొని ఆన్లైన్ షాపింగ్ వరకు ప్రతిఒక్కటి మొబైల్ ద్వారానే చేస్తుండడంతో మొబైల్ ఒక్క క్షణం చేతిలో లేకపోయిన ఎంతో వెలితిగా ఉంటుంది. అయితే మనం ఇంట్లో ఉన్నప్పుడో లేక బయట ఉన్నప్పుడో ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటూ మొబైల్ ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాము. ఎంత వెతికినా కొన్ని సార్లు మొబైల్ దొరకదు. అలాంటి సమయాల్లో చాలా మందికి ఏం చేయాలో అర్థం కాదు. అయితే మొబైల్ లో ఉన్న కొన్ని టిప్స్ పాటించడం వల్ల మొబైల్ ఎక్కడ మర్చొపోయామో సులభంగా గుర్తించవచ్చు. అవేంటో చూద్దాం !.

1.ముందుగా మనం మొబైల్ డేటా మరియు లొకేషన్ ఎప్పుడు కూడా ఆన్ లోనే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ముబైల్ ను గుర్తించడం సులభం అవుతుంది.

2.ఎక్కడైనా మర్చిపోయిన మొబైల్ ను గుర్తించేందుకు ముందుగా వేరే మొబైల్ లో మీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి.
3.లాగిన్ అయిన తరువాత గూగుల్ సర్చ్ బార్ లో ” FIND MY DEVICE ” అని సర్చ్ చేయాలి. ఆ తరువాత గూగుల్ అఫిసియల్ లింక్ అయిన ” find my device ” ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు మొబైల్ ఎక్కడ ఉందో చూపే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.

అక్కడ మీరు లాగిన్ అయిన గూగుల్ అకౌంట్ ఎన్ని మొబైల్స్ లో యాక్టివ్ గా ఉందో కనబడుతుంది. అప్పుడు మీరు మర్చిపోయిన మొబైల్ ను ఎంచుకోవాలి. అప్పుడు మీరు మర్చిపోయిన మొబైల్ ఉన్న లొకేషన్ అక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు మొబైల్ ను మీరున్న ప్రదేశం దగ్గర్లోనే మర్చిపోయి ఉంటే కింద ఉన్న రింగ్ ఆప్షన్ నొక్కడం వల్ల ఫుల్ వాల్యూమ్ లో 5 నిముషాల పాటు మర్చిపోయిన మొబైల్ కు రింగ్ వస్తుంది. దాంతో మనం మొబైల్ ను గుర్తించవచ్చు. ఒకవేళ మీ మొబైల్ ను మీకు తెలియని ఇతరులు తీసుకున్నప్పుడు మీ పర్సనల్ డేటా ను వారు దొంగిలించకుండా find my device లో పూర్తిగా కూడా తొలగించవచ్చు.

Also Read

ఫోన్ వర్షంలో తడిస్తే ఇలా చేయండి..

మొబైల్ చార్జింగ్ వెంటనే అయిపోతుందా.. అయితే ఇలా చేయండి !

వావ్.. ఇకపై వాట్సప్ లో ఆ ప్రాబ్లం కు చెక్ !

Related Articles

Most Populer

Recent Posts