ఫోన్ వర్షంలో తడిస్తే ఇలా చేయండి..

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో దాన్ని పాడవకుండా జాగ్రత్తగా ఉంచుకునేందుకు చాలా మంది విశ్వ ప్రయత్నలే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ కింద పడితే జరిగే డ్యామేజ్ కన్నా.. నీటిలో పడితే అధిక డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఎదుకంటే మొబైల్ లో ఉండే చిన్న చిన్న కాంపొనెంట్స్ వాటర్ ను అబ్జర్బ్ చేసుకోవడం వల్ల మొబైల్ డెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో మొబైల్ ను వాటర్ కు దూరంగా ఉంచుతుంటారు చాలమంది. అయితే మిగిలిన సమయాల్లో ఎలా ఉన్న ఈ వర్షకాలంలో మాత్రం మొబైల్ ను వాటర్ కు దూరంగా ఉంచడం కాస్త కష్టమే. ఎందుకంటే ప్రయాణాల సమయాల్లోనూ, లేదా బయట ఉన్న సమయాల్లోనూ వర్షం పడితే మొబైల్ చాలా ఈజీగా తడిచిపోతుంది. అయితే కొన్ని మొబైల్స్ కు వాటర్ రెసిస్టెంట్ ఉండడం వల్ల వాటికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ చాలా మొబైల్స్ కు వాటర్ రెసిస్టెంట్ ఉండదు.. అలాంటి మొబైల్లో కాస్త వాటర్ చేరిన పాడవుతుంటాయి. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించి మొబైల్ పాడవకుండా కాపాడుకోవచ్చు. అవి ఏంటో చూద్దాం !

1.మొబైల్ వర్షంలో తడిచినప్పుడు.. ఒకవేళ స్విచ్ ఆఫ్ లో ఉంటే దానిని ఏమాత్రం స్విచ్ ఆన్ చేయకూడదు. ఇక చేయడం వల్ల మొబైల్ లో ఉండే వాటర్ ను బ్యాటరీ అబ్జర్బ్ చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల బ్యాటరీ తొందరగా పాడవుతుంది.

2.మొబైల్ లోకి వాటర్ చేరినప్పుడు దానిని ఎక్కువసార్లు కదిలించకూడదు. ఎందుకంటే అలా కదిలించడం వల్ల మొబైల్ లోని సున్నితమైన కాంపొనెంట్స్ కు వాటర్ చేరి త్వరగా పాడవుతుంది.

3.మొబైల్ వాటర్ లో తడిచి స్విచ్ ఆఫ్ అయినప్పుడు..చార్జింగ్ పెట్టె ప్రయత్నం చేయకూడదు. ఇలా చేయడం వల్ల మొబైల్లో షాక్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది.

మొబైల్ వాటర్ లో తడిచినప్పుడు దానిని ఏమాత్రం కదిలించకుండా సున్నితమైన కాటన్ గుడ్డతో తుడవాలి. ఆ తరువాత బియ్యం ఉన్న సంచిలో మొబైల్ ను ఉంచాలి. ఎందుకంటే బియ్యనికి వాటర్ ను గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది. మొబైల్ పొడిబారిన తరువాత మొబైల్ స్విచ్ ఆన్ చేయకుండా చార్జింగ్ పెట్టాలి. ఇలా చేయడం వల్ల బ్యాటరీ వేడి కారణంగా మొబైల్ లో ఉన్న వాటర్ అవిరవుతుంది. పూర్తిగా మొబైల్ పూర్తిగా పొడిబారిన తరువాత స్విచ్ ఆన్ చేయాలి. అయినప్పటికి మొబైల్ స్విచ్ ఆన్ అవ్వకపోతే, సర్వీస్ సెంటర్ కు తీసుకు వెళ్ళడం మంచిది.

Also Read

వావ్.. ఇకపై వాట్సప్ లో ఆ ప్రాబ్లం కు చెక్ !

మొబైల్ చార్జింగ్ వెంటనే అయిపోతుందా.. అయితే ఇలా చేయండి !

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పెంచే అద్బుతమైన టిప్స్ !

Related Articles

Most Populer

Recent Posts