Thursday, May 9, 2024
- Advertisement -

వైఎస్ – జగన్‌ల మధ్య ఉన్న తేడాను చూపించిన ఆ సంఘటన

- Advertisement -

వైఎస్ రాజశేఖరరెడ్డికి వైఎస్ జగన్‌కి ఉన్న ప్రధాన తేడా ఏంటి? అసలు ఇద్దరి వ్యక్తిత్వంలోనూ తేడాలు ఉన్నాయా అన్న చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంది. అయితే ప్రజలకు కనిపించిన…..కనిపిస్తున్న వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లలో తేడాలు అయితే మరీ పెద్దగా ఏమీ లేవు. ఇక పార్టీని ఫిరాయించిన నాయకులతో సహా టిడిపి నాయకులు కూడా అంతర్గతంగా జగన్ వ్యక్తిత్వం, విశ్వసనీయత, మాట మీద నిలబడడం లాంటి లక్షణాలు చంద్రబాబులో లేవని చెప్తూ ఉంటారు. వైఎస్‌లో కూడా ఇవే లక్షణాలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డి-వైఎస్ జగన్‌ల వ్యక్తిత్వంలో ఉన్న తేడాను చూపిస్తున్నాడు. వైఎస్సార్ బ్రతికున్నప్పుడు…చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇదే సీనియర్ జర్నలిస్ట్ వైఎస్‌ని కలిసి చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్ హడావిడి ఓవర్‌గా చేస్తున్నారని….. బాబు పుట్టింది ఏప్రిల్ నెల 20వ తేదీ కాబట్టి షార్ట్ కట్‌లో 420 అవుతుందని…. ఆ విధంగా చంద్రబాబును 420 అని అంటే జనాల్లోకి బాగా రీచ్ అవుతుందని చెప్పాడట. ఆ జర్నలిస్ట్ మాటలు విన్న వైఎస్ గట్టిగా నవ్వేశాడట. నిజంగా చంద్రబాబు బర్త్ డే ఏప్రిల్ 20నేనా? 420 అవుతుందా? అని ఆ జర్నలిస్ట్‌ని అడిగాడట. ఆ జర్నలిస్ట్ వెంటనే చంద్రబాబునాయుడు బయోడేటా చూపించాడట. ఆ వెంటనే రెండు నిమిషాలు ఆలోచించిన వైఎస్…..‘నో….అలా నేను చెయ్యలేను…..చంద్రబాబుని రాజకీయంగానే ఎదుర్కుందాం…’ అని చెప్పాడట. ఇప్పుడు ఇదే విషయాన్ని వైఎస్‌కి జగన్‌కి మధ్య ఉన్న ప్రధాన తేడాగా కొంతమంది చూపిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిలో ఉన్న గొప్ప క్వాలిటీస్ జగన్‌లో లేవని చెప్తున్నారు.

అయితే ఎక్కువ మంది మాత్రం వైఎస్ కాలానికి ఇప్పటికీ చాలానే మారాయని చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రిని హత్య చేసి అయినా అడ్డు తొలగించుకోవాలని అనుకునే స్థాయికి ప్రత్యర్థులు వెళ్ళలేదా? ఇక నేరగాడు, రాక్షసుడు అంటూ ఇష్టారీతిన మాట్లాడలేదా? వైఎస్ రాజశేఖరరెడ్డి, విజయమ్మ పెంపకమే మంచిది కాదని విమర్శించడం, చనిపోయిన తర్వాత కూడా వైఎస్‌పైన దారుణమైన విమర్శలు చేయడం లాంటివి చూసిన జగన్….చంద్రబాబు విషయంలో ఏ ఒక్క అవకాశం కూడా వదులుకోవాలని అనుకోవట్లేదని అభిప్రాయపడుతున్నారు. అన్నింటికీ మించి విభజన నాటి నుంచీ ఇప్పటి వరకూ సీమాంధ్ర ప్రజలను చంద్రబాబు వంచిస్తున్న వైనం చూస్తున్న…….అర్థం చేసుకుంటున్న ప్రజలు కూడా జగన్ స్థాయిలోనే చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -