Tuesday, April 30, 2024
- Advertisement -

కేసీఆర్ చ‌రిత్ర సృష్టిస్తాడా లేకా బాబు స‌ర‌స‌న చేరుతాడా…?

- Advertisement -

అసెంబ్లీనీ ర‌ద్దు చేసి ఒకే సారి 105 మంది అభ్య‌ర్తుల జాబితాను కేసీఆర్ ప్ర‌క‌టించి తెలంగాణాలో రాజ‌కీయ హీట్‌ను పెంచారు. ఒక విధంగా చెప్పాలంటే ప్ర‌తిప‌క్షాల మీద స‌ర్జిక‌ల్ స్ట్రైక్ లాంటిదే. 105 మంది అభ్యర్థులను ప్రకటించడమంటే.. ఎదుటి వ్యక్తులు సిద్ధం కాకముందే ఎదురుదాడి చేయడం. దాని వల్ల తమ ప్రత్యర్థి కోలుకోకుండా ప్రయత్నం చేయడంలో కేసీఆర్ స‌ఫ‌లం అయ్యారనే చెప్పాలి.

ఉమ్మ‌డి రాష్ట్రంలో గ‌తంలో ముంద‌స్తు ఎన్నిక‌ల చ‌రిత్ర చూసుకుంటే ఎన్టీఆర్ , చంద్ర‌బాబు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెల్లారు. ఇప్పుడు తెలంగాణాలో కేసీఆర్ ముంద‌స్తుకు రెడీ అయ్యారు. 1983లో ముఖ్య‌మంత్రిగా ఉన్న ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ కోసం ఆయన అమెరికాకు వెళ్లారు. ఎన్టీఆర్ అమెరికా నుండి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు నేతృత్వంలో తిరుగుబాటు జరిగింది.1984 ఆగష్టు 16 న నాదెండ్ల భాస్కరరావు సీఎం అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ను సెప్టెంబర్ 16 న తిరిగి ముఖ్యమంత్రిగా నియమించారు.

2004లో సీఎం చంద్ర‌బాబు ముంద‌స్తు ఎన్నిక‌ల వ్యూహం విక‌టించి ఘోరంగా ప‌రాజ‌యం పాల‌య్యారు. అలిపిరి ఘటనను రాజకీయంగా తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని భావించాడు. మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో తృటిలో ప్రాణాపాయం నుండి బాబు తప్పించుకొన్నారు. అయితే ఎన్నికలకు 8 మాసాల ముందే చంద్రబాబునాయుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెల్లాడు. ఎన్నికల్లోకేవలం 47 సీట్లకే ప‌రిమిత‌మైన టీడీపీ ప్ర‌తిప‌క్షంలో కూర్చుంది. అంతేనా భాజాపాను కూడా నిలువునా ముంచేశాడు.

సీన్ క‌ట్ చేస్తే కేసీఆర్ కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు రెడీ అయిపోయారు. 2014 జూన్ రెండో తేదిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తెంగాణా మొద‌టి ముఖ్య మంత్రిగా కేసీఆర్ ప‌ద‌వి చేప‌ట్టారు. కేసీఆర్ కూడా బాబు లాగే ఎన్నికలకు 8 మాసాల ముందే చంద్రబాబునాయుడు అసెంబ్లీని రద్దు చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల అనుభ‌వంతో చంద్ర‌బాబు ఆ ఊసే ఎత్త‌డంలేదు. ఇప్పుడు కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నాడు. రామారావులాగా చ‌రిత్ర సృష్టిస్తాడో లేకా బాబు స‌ర‌స‌న చేరుతాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -