Sunday, April 28, 2024
- Advertisement -

మజ్జిగ చేసే మేలు తెలిస్తే… అస్సలు వదలరు..

- Advertisement -

ఎండా కాలంలో మ‌జ్జిగ‌కు ఉన్న డిమాండ్ చెప్ప‌న‌క్క‌ర లేదు. పాలు,పెరుగు కంటె మ‌జ్జిగ‌లోనే శ‌రీరానికి మేలు చేసె గుణాలు పుస్క‌లంగా ఉన్నాయి. ఆయుర్వేధంలో కూడా మ‌జ్జిగ‌కు ప్రాధాన్య‌త ఉంది. వాత, కఫ దోషాలను తగ్గిస్తుందనీ చెబుతుంది. అంతేకాదు మ‌జ్జిగ వ‌ల్ల ఎలాంటి ఉప‌యేగాలు ఉన్నాయే ఇప్పుడు తెలుసుకుందాం..

ప్ర‌ధానంగా కడుపులో మంటతో బాధపడేవాళ్లకి మజ్జిగ మంచి మందులా పనిచేస్తుంది. మసాలా ఆహారం లేదా విందు భోజనాల్లో కాస్త ఎక్కువగా ఆహారం తీసుకోవ‌డం స‌హ‌జం. కాని త‌రువాత క‌డుపులో భాధ మొద‌ల‌వుతుంది. దీనినుంచి ఉప‌శ‌మ‌నం పొందాలంటె ఓ గ్లాసు మజ్జిగ తాగితే, అందులోని మసాలాల కారణంగా పొట్ట గోడలు దెబ్బతినకుండా కాపాడుతుంది. మజ్జిగలోని ప్రొటీన్లు మసాలా వేడిని తగ్గిస్తాయి. గొంతు, పొట్టగోడలకు పట్టినట్లుండే నూనె, వెన్న, నెయ్యి వంటివాటిని తొలగిస్తాయి.

ఎండాకాలం చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ఎండ‌లో తిర‌గ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ల‌వ‌ణాలు చెమ‌ట రూపంలో బ‌య‌ట‌కు వెల్తాయి. బాడీ డీహైడ్రేష‌న్‌కు గుర‌వుతుంది. అలాంటి స‌మ‌యంలో మ‌జ్జిగ బాగా ప‌నిచేస్తుంది.మజ్జిగలో అల్లం, జీలకర్ర వంటివి వేయడంవల్ల అజీర్తి తగ్గి, జీర్ణశక్తి పెరుగుతుంది.

శ‌రీరానికి క్యాల్సియం ఎంతో అవ‌స‌రం. ఎముల‌కు గ‌ట్టిగా ఉండాలంటె శ‌రీరానికి త‌గినంత క్యాల్సియం అవ‌స‌రం. కొవ్వులేని కాల్షియానికి మజ్జిగ మంచి వనరు. శరీరానికి రోజుకి సుమారుగా 1000-1200 మి.గ్రా. కాల్షియం అవసరం. ఓ గ్లాసు మజ్జిగ నుంచి 350 మి.గ్రా. కాల్షియం లభ్యమవుతుంది.

మజ్జిగలో ప్రొటీన్లూ, పొటాషియం, బి-కాంప్లెక్స్‌ విటమిన్లూ పుష్కలంగా ఉండటంతో మంచి నిద్రపట్టేలా చేస్తాయి. రోగనిరోధకశక్తినీ పెంచుతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌, బీపీ, క్యాన్సర్లూ రాకుండా మజ్జిగ నియంత్రిస్తుంది.

మొలలతో బాధపడేవాళ్లకి మజ్జిగ మందులా ఉపయోగపడుతుంది. వాటి పరిమాణాన్నీ, దురదనీ, నొప్పినీ కూడా తగ్గిస్తుంది. పాలల్లోని లాక్టోజ్‌ అరగనివాళ్లకి మజ్జిగ అన్నివిధాలా మేలు. చూశారుగా మ‌జ్జిగ శ‌రీరానికి ఎంత మేలు చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -