Friday, March 29, 2024
- Advertisement -

రుచికరమైన బ్రేడ్ బోండా ఎలా చేయాలో తెలుసా?

- Advertisement -

సాయంత్రం పూట బాగా బోర్ కొడుతుంది ఏవైనా స్నాక్స్ తినాలనిపిస్తే అటువంటి వారికి బ్రెడ్ బోండా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. చాలా తక్కువ సమయంలోనే బ్రెడ్ బోండాలు తయారు చేసుకుని సాయంత్ర సమయాన్ని ఎంతో అద్భుతంగా ఆస్వాదించవచ్చు. మరి క్రిస్పీ…క్రిస్పీగా ఉండే బ్రెడ్ బోండాలను ఏలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:
బ్రెడ్ పౌడర్ ఒకటిన్నర కప్పు,ఉడికించిన బంగాళదుంప ఒక కప్పు,జీలకర్ర పొడి పావు టీ స్పూన్ కొద్దిగా పచ్చి కరివేపాకు,ఉల్లిపాయ ముక్కలు 2స్పూన్లు,ఉప్పు తగినంత,పులిసిన గట్టి పెరుగు 2 స్పూన్లు,కారం పొడి అర టీ స్పూన్,నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత

తయారీ విధానం:
*ముందుగా ఉడికించిన బంగాళదుంపను మెత్తగా చిదిమి పెట్టుకోవాలి.

*బంగాళదుంపలలోకి జీలకర్ర పొడి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొద్దిగా కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి.

Also read:నటనకు గుడ్ బై చెప్పనున్న రంగం హీరోయిన్!

  • ఈ మిశ్రమంలోకి బ్రెడ్ పౌడర్ వేసుకొని కొద్దికొద్దిగా పెరుగుని వేస్తూ బోండా పిండిలా కలుపుకోవాలి.

*ఈ విధంగా పిండిని తయారు చేసుకున్న తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి.

*వేడి వేడిగా ఉన్న ఈ బ్రెడ్ బోండాలను పల్లి చట్నీ లేదా టమోటో సాస్ తో సర్వ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా… టేస్టీ గా ఉండే బ్రెడ్ బోండాల రుచిని ఆస్వాదించవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -