Tuesday, April 30, 2024
- Advertisement -

వేరుశెనగ పల్లీ కారం ఎంత రుచిగా ఉంటుందో తెలుసా?

- Advertisement -

వేరుశెనగ పల్లీ కారం పొడి అంటే రాయలసీమలో ఎంతో ఫేమస్. ఎక్కువగా రాయలసీమ ప్రాంతాలలో ఈ కారం పొడి తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఎంతో రుచికరమైన ఈ పల్లీ కారం పొడిని వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి కలిపి తింటే ఆ రుచి మాటల్లో వర్ణించలేనిది. మరి అంతే రుచికరమైన పల్లీ కారం పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

కావలసిన పదార్థాలు:
వేరుశనగ పల్లీలు 3 కప్పులు, వెల్లుల్లి రెబ్బలు 20, ఎండుమిర్చి10,చిన్న సైజు బెల్లం ముక్క (ఇష్టముంటేనే),
తగినంత ఉప్పు

తయారీ విధానం:
*ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి వేరుశనగ పల్లీలను బాగా వేయించుకోవాలి. పల్లీలు మొత్తం ఎర్రగా వేయించుకున్న తరువాత ఎండు మిర్చి వేసి కొద్దిగా నూనె వేసి ఒక నిమిషం వేయించుకోవాలి.

  • ఇప్పుడు వేరుశనగ పల్లీలను చల్లబరచి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలను సిద్ధం చేసుకోవాలి.

*ముందుగా రుబ్బు రోలులో వేయించుకున్న ఎండుమిర్చి,రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

Also read:నటనకు గుడ్ బై చెప్పనున్న రంగం హీరోయిన్!

*అందులో వేరుశనగ పల్లీలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం మెత్తగా అయిన తరువాత వెల్లుల్లి వేసి బాగా రుబ్బుకోవాలి.

*కొందరికీ ఈ వేరుశనగ పొడిలో బెల్లం వేసుకొని తినడం అలవాటు ఉంటుంది.ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు లేకపోతే లేదు.

Also read:షారుక్ ఖాన్ తో రొమాన్స్ చేయనున్న నయనతార..?

*ఈ విధంగా తయారైన వేరుశెనగ పల్లీల కారం పొడి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే మరీ మరీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -