Thursday, May 2, 2024
- Advertisement -

చలికాలంలో వేడి నీళ్ళతో స్నానం చేస్తే.. అంతే సంగతులు !

- Advertisement -

ఎట్టకేలకు చలికాలం రానే వచ్చింది. ఈ చలికాలంలో చలి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా వేడి నీళ్ళతో స్నానం చేయడం, మందమైన స్వెటర్లు దరించడం, ఎక్కువగా బయట తిరగకపోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే చలికాలంలో చలి బారి నుంచి తప్పించుకునేందుకు మనం చేసే కొన్ని ప్రయత్నాలు పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా చలికాలంలో చాలమంది వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే వేడి నీటి స్నానం చలి నుంచి కొంత ఉపశమనం కలిగించినప్పటికి దానివల్ల అనార్థాలు కూడా చాలానే ఉన్నాయి.

చల్లటి వాతావరణంలో అధికంగా వేడి నీటితో స్నానం చేయడం వల్ల కేరాటీన్ అనే చర్మ కణాలు దెబ్బతినే అవకాశం ఉండని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల చర్మం పొడి బారడం, దురద, దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందట. అంతే కాకుండా చలికాలంలో వేడి నీటితో అధిక స్నానం చేయడం వల్ల శరీరం అలసత్వానికి గురైయ్యే అవకాశం ఉండట. అందువల్ల ఏదైనా వర్క్ చేసే క్రమంలో నిద్ర మత్తు అధికంగా వచ్చే అవకాశం ఉండని నిపుణులు చెబుతున్నారు. ఇక చలికాలంలో చాలమంది మందమైన దుస్తులు దరించడం వంటివి చేస్తూ ఉంటారు.

ఇలా మందమైన దుస్తులు దరించడం కూడా మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. స్వెటర్స్, మందమైన దుస్తులు దరించడం వల్ల శరీరం అధికంగా వేడికి గురౌతుందని, ఇలా అధిక వేడి కారణంగా రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉండట. అందుకే చలికాలంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అధిక వేడి నీటి స్నానం కన్నా, గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. ఇంకా చల్లటి నీటితోనే స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ మరింత మెరుగుపడి.. రోజంతా ఉత్సాహంగా ఉండే అవకాశం అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే చలికాలంలో వీలైనంత వరకు చల్లటి నీటితోనే స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రాత్రి నిద్రించే ముందు ఈ ఆహారంతో ఆరోగ్యానికి మేలు !

ఈ జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ రాదట!

మొబైల్ స్పీకర్ లో దుమ్ము చేరితే.. ఇలా చేయండి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -