Tuesday, April 30, 2024
- Advertisement -

సావాస దోషం… చంద్రబాబులానే బీద అరుపులు అరుస్తున్న ముఖేష్ అంబానీ

- Advertisement -

ముఖేష్ అంబానీ కూడా చంద్రబాబు బాటలో నడుస్తున్నాడా? ఇతర వ్యాపార సామ్రాజ్యాలతో పోల్చితే రిలయన్స్‌కి విలువలు తక్కువని, వ్యాపారానికే ప్రాధాన్యత ఇస్తారని ఎప్పటి నుంచో రిలయన్స్‌పై విమర్శ ఉంది. మరీ ముఖ్యంగా టాటాలు- అంబానీలు పరస్పరం పోటీ పడినప్పుడు టాటాల మంచితనం, సామాజిక సేవ, టాటాలు అనుసరించే విలువలను మేధావులు చాలా గొప్పగా చెప్పారు. అవన్నీ నిజం కూడా. అదే సమయంలో అంబానీల వ్యాపార సామ్రాజ్య విస్తరణ కాంక్ష, డబ్బుకు ప్రాధాన్యతనిచ్చే లక్షణాన్ని కూడా చాలా మంది విమర్శించారు. ఇక రాజకీయాల్లో డబ్బును ప్రవేశపెట్టిందే చంద్రబాబు అని ఇప్పటికే రాజకీయవేత్తలు చాలా మంది చెప్పారు. మరీ ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో కమిషన్లు, సీట్ల పంపకాల్లో డబ్బుల వ్యవహారాలను బాగా పాపులర్ చేసింది చంద్రబాబే అని చాలా మంది చెప్పారు. సాక్షాత్తూ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు డబ్బు పిచ్చి గురించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు.

కెజీ బేసిన్ గ్యాస్‌ని అప్పనంగా రిలయెన్స్‌కి దోచిపెట్టాలనుకున్నాడు చంద్రబాబు. అయితే వైఎస్ మాత్రం…..‘అది ఎవడబ్బ సొమ్మూ కాదు…….ఆంధ్రుల సొత్తు….’ అని ఫైట్‌కి దిగాడు. ఆ తర్వాత వైఎస్సార్ మరణం…ఆ మరణం వెనకాల రిలయెన్స్‌తో పాటు, సోనియా, చంద్రబాబుల హస్తం గురించి కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఒక రష్యన్ వెబ్‌సైట్ అయితే ఆధారాలతో సహా ఒక వార్తను ప్రచురించింది. ఈనాడులో రిలయెన్స్ పెట్టుబడులు, చంద్రబాబు అక్రమాస్తులపై హైకోర్టులో కేసు వేస్తే రిలయెన్స్ వాళ్ళు కూడా బాబుకు మద్ధతుగా రావడం…….ఆ తర్వాత కేసు కొట్టేయడం లాంటివి చాలానే వార్తల్లో చూశాం.

అయితే చంద్రబాబుతో సావాస దోషమో ఏమో తెలియదు …….లేకపోతే డబ్బు మనిషి అని తనపై ఉన్న విమర్శలను తగ్గించడం కోసం ‘నా జేబులో డబ్బులే ఉండవు……’ అని చంద్రబాబు చెప్పినట్టుగా ఇప్పుడు రిలయెన్స్ ముఖేష్ అంబానీ కూడా చెప్పుకొచ్చాడు. ఆయన దగ్గర డబ్బులు అస్సలు ఉండవట. ఇంకా హాస్యాస్పదం ఏంంటంటే తనకు క్రెడిట్ కార్డ్ కూడా లేదని చెప్పాడు అంబానీ. అయినా క్రెడిట్ కార్డులు, అప్పులు అంబానీలకు అవసరమా? ఇక ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచింది తెలుగు ప్రజలను ఉద్ధరించడానికే, దుష్టశక్తుల నుంచి తెలుగు ప్రజలను రక్షించడానికే అని చెప్పుకునే చంద్రబాబులాగే అంబానీ కూడా జియో గురించి, తన వ్యాపార విస్తరణ గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. జియోతో సహా తన వ్యాపార సామ్రాజ్య విస్తరణ మొత్తం కూడా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి, భారతీయులకు ప్రయోజనం చేకూర్చడానికే చేస్తున్నాడట. ఆర్థిక లాభాలు అనేవి ముఖ్యం కాదట. బాగుంది……చాలా బాగుంది……..చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలయితే అంబానీవి కూడా అన్నీ నిజాలే. కాకపోతే ఒక్కటే సందేహం…….భారతీయుల్లో పేదల సంఖ్య నానాటికీ పెరిగిపోతూ ఉంది………నోట్ల రద్దు, జీఎస్టీ ఎఫెక్ట్‌లాంటివి ఏమీ లేకుండా రిలయెన్స్ వారి ఆస్తులు మాత్రం ఘడియ ఘడియకూ పెరిగిపోతున్నాయి……..ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ధనవంతులుగా రిలయెన్స్ వారు నిలబడినా ఆశ్ఛర్యపోవాల్సిన అవసరం లేదు……..అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది పేదలున్న దేశంగా భారతదేశం నిలబడినా ఆశ్ఛర్యం లేదు. ఆర్థిక లాభాలో కోసం కాదు…..దేశానికి సేవ చేయడం కోసం, దేశాన్ని ఉద్ధరించడం కోసం అన్న అంబానీ మాటలకు ఈ వైరుధ్యాలకు ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడో తేడా కొట్టట్లేదూ…….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -