Monday, May 6, 2024
- Advertisement -

ఖాళీ క‌డుపుతో ఖర్జూర‌లు తింటున్నారా? ఈ విష‌యాలు తెలుసుకోవాల్సిందే !

- Advertisement -

ఖ‌ర్జూర పండ్లు అనేక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఈ పండును తినడం వల్ల మలబద్దకం, ప్రేగు సంబంధిత రుగ్మతలు, రక్తహీనత, క్యాన్సర్ వంటి అనేక సమస్యలను నుంచి ఉపశమనం పొందవచ్చు. వీటితో పాటుగా గుండె సంబంధిత సమస్యలను, అతిసారం, లైంగిక లోపాలకు కూడా చక్కటి ఔషదంలా ఈ ఖ‌ర్జూరలు పనిచేస్తాయి. అలాగే సన్నగా ఉన్నవారు వీటిని తీసుకుంటే త్వ‌ర‌గా బ‌రువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఖ‌ర్జూర‌ల‌ నుంచి విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే ఈ పండు ఫ్రక్టోజ్ ను కలిగి ఉంటుంది. అందువల్ల ఈ పండును ఖాళీ కడుపున తీసుకుంటే కడుపు నొప్పి, అసౌకర్యంగా ఉంటుంది. సో ఈ పండును ఖాళీ కడుపుతో తీసుకోకుండా జాగ్రత్తపడాలి. అలాగే, క‌డుపులో ఉత్ప‌త్తి అయ్యే ఎంజైమ్‌ల‌పై ప్ర‌భావం ప‌డుతుంది. ముఖ్యంగా ఈ పండు యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్ ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లను పుష్కలంగా కలిగి ఉంటుంది.

ఇవన్ని క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల‌కు మంచి నివారణీలా పనిచేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది. ఈ ఖర్జూరలను ప్రతి దినం తీసుకోవడం వలన ఎముకలు ఆరోగ్యంగా గట్టిగా ఉంటాయి. అలాగే ఈ పండు ఫైబర్ ను ఎక్కువ మొత్తంలో కలిగి ఉండటం వల్ల మలబద్దకం సమస్య నుంచి విముక్తి పొందడమే కాకుండా.. జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో హృతిక్ రోష‌న్ ఫైట్ !

బిగ్ బాస్-5లో స్టార్ సింగర్ హేమచంద్ర !

క్రేజీ ఫాదర్ అండ్ డాటర్ !

ఈ అమ్మడు కూడా పవన్ కు నో చెప్పిందా?

భారీగా రేటు పెంచిన బుట్టబొమ్మ !

అయ్యయ్యో.. పవన్ సినిమాకు కూడా లీకుల దెబ్బ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -