నంబర్ వన్ హీరోల పొంగల్ ఫైట్.. ఇక రచ్చ రచ్చే..!

- Advertisement -

ఈసారి సంక్రాంతి పోరు రసవత్తరంగా మారనుంది. నంబర్ వన్ ప్లేస్ లో ఉన్న ముగ్గురు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద తలపడనున్నారు. ఈ సారి సంక్రాంతి పండుగకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ మలయాళ రీమేక్ విడుదల కానుంది. ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు.

వఖీల్ సాబ్ సూపర్ హిట్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక మహేష్ బాబు- పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి హిట్ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా కావడం, గీతగోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

ఇక తమిళ అగ్రహీరో విజయ్ నటిస్తున్న బీస్ట్ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. విజయ్ నటిస్తున్న ప్రతి సినిమా హిట్ ఫ్లాప్ కు సంబంధం లేకుండా భారీగా వసూళ్లు సాధిస్తుండడం తో బీస్ట్ పై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. సీనియర్ తెలుగు హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఎఫ్ 3 కూడా సంక్రాంతికి సందడి చేయనుంది. ఇప్పటికే ఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలబడడంతో ఎఫ్ 3 పై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.

సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి మెయిన్ సీజన్. పల్లెల్లో వరి కోతలు పూర్తయి ధాన్యం సంక్రాంతికి ఇంటికి చేరుకుంటుంది. అందువల్లే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ను ఘనంగా జరుపుకుంటారు. కళాశాలలు, పాఠశాలలకు కూడా పది రోజుల పాటు సెలవులు వస్తాయి. దీంతో ఈ పండుగను టార్గెట్ చేసుకొని పెద్ద సంఖ్యలో సినిమాలు విడుదలవుతుంటాయి. ముఖ్యంగా అగ్ర హీరోలు నటించిన సినిమాలు సంక్రాంతి పండుగకు విడుదల అవుతుంటాయి. ఈసారి అగ్రహీరోలు నటించిన సినిమాలు సంక్రాంతి రేసులో నిలవడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ ఆసక్తిగా మారింది.

Also Read

ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..!

దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్..!

ఈ భామ జోరు చూస్తే ..పూజా హెగ్డే, రష్మికకు ఎసరు పెట్టేలా ఉందే..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -