Saturday, April 27, 2024
- Advertisement -

రుచికరమైన చికెన్ పాప్ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

- Advertisement -

చికెన్ తో మనం వివిధ రకాల రెసిపీ లను తయారు చేసుకుని తినడం సర్వసాధారణమే. అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవారి ఎంతో ఇష్టంగా తినే వాటిలో చికెన్ పాప్ కార్న్ ఒకటి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ చికెన్ పాప్ కార్న్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:

చికెన్ బోన్ లెస్ ఒక కప్పు, బ్రెడ్ పౌడర్ 3 టేబుల్ స్పూన్లు, కారం ఒక టీ స్పూన్, మొక్కజొన్న పిండి ఒకటిన్నర కప్పు, ఉప్పు తగినంత, కోడిగుడ్డు 1, మైదాపిండి1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, సోయా సాస్ 1స్పూన్, మిరియాల పొడి 1 సెక్స్

తయారీ విధానం:

*ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో అరకప్పు మొక్కజొన్న పిండి వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని పలుచగా కలుపుకోవాలి.

*ఈ మొక్కజొన్న మిశ్రమంలోకి చికెన్ ముక్కలను వేసి ఐదు నిమిషాల పాటు అలా నానబెట్టుకోవాలి.

Also read:చిరంజీవి లేటెస్ట్ లుక్ చూశారా.. ఎంత బాగుందో?

*తర్వాత మరొక గిన్నె తీసుకొని అందులోకి సోయా సాస్, మిరియాల పొడి, మైదాపిండి, కొద్దిగా ఉప్పు, గుడ్డు వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ముందుగా నానబెట్టుకొన్న చికెన్ ముక్కలను మాత్రమే తీసుకుని బాగా కలుపుకోవాలి.

*తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక కప్పు మొక్కజొన్న పిండి, కారం, కొద్దిగా ఉప్పు, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి.

Also read:175 కోట్ల రూపాయిల ఇల్లు.. ప్రియుడి కోసమే కొన్న హీరోయిన్!

*ముందుగా నానబెట్టిన చికెన్ ముక్కలను తీసుకుని, ప్లేట్ లో తయారు చేసుకున్న మిశ్రమంలో వేసి బాగా డిప్ చేసిన తర్వాత ఆ చికెన్ ముక్కలను బాగా వేడెక్కిన నూనెలోకి వేసి దోరగా వేయించుకోవాలి.

*దోరగా వేయించిన చికెన్ ముక్కలను వేడివేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -